Samsung Galaxy | సామ్సంగ్ మడతపెట్టే ఫోన్ల కోసం ఎగబడుతున్న కస్టమర్లు.. లక్షన్నర ముందస్తు బుకింగ్లు పూర్తి
Samsung Galaxy | సామ్సంగ్కు చెందిన పలు మాడళ్లకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. దేశీయంగా తయారైన గెలాక్సీ జెడ్ ఫ్లిప్5, జెడ్ఫోల్డ్5లకోసం కస్టమర్లు ఎగబడి కొనుగోలు జరుపుతున్నారు.
Samsung Galaxy | నూఢిల్లీ, ఆగస్టు 24: సామ్సంగ్కు చెందిన పలు మాడళ్లకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. దేశీయంగా తయారైన గెలాక్సీ జెడ్ ఫ్లిప్5, జెడ్ఫోల్డ్5లకోసం కస్టమర్లు ఎగబడి కొనుగోలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు 1.50 లక్షల ముందస్తు బుకింగ్లు వచ్చాయని కంపెనీ పేర్కొంది. ఐదో జనరేషన్గా గత నెల చివర్లో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ కోసం ఈ నెల 17న ముందస్తు బుకింగ్లను నిలిపివేసింది.
ఐదో జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభించిందని సామ్సంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ తెలిపారు. ఈ గెలాక్సీ జెడ్ ఫ్లిప్, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5తో దేశీయ ప్రీమియం స్మార్ట్ఫోన్ల మార్కెట్లో తిరిగి తొలి స్థానం దక్కించుకోనున్నట్లు చెప్పారు. ఈ గెలాక్సీ ఫోన్లను రిటైల్ మార్కెట్లో 10 వేల స్టోర్లలో కూడా లభించనున్నట్లు తెలిపారు. గెలాక్సీ జెడ్ ఫ్లిప్5(256జీబీ) ధర రూ.85,999, గెలాక్జీ జెడ్ ఫోల్డ్ 5(256జీబీ) ధర రూ.1,38,999 గా నిర్ణయించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

