Fastest Internet | ప్రపంచంలోనే హైస్పీడ్ ఇంటర్నెట్ను తీసుకొచ్చిన చైనా.. సెకనులో 150 సినిమాలు డౌన్లోడ్ చేయొచ్చు!
Fastest Internet | అద్భుత టెక్నాలజీల ఆవిష్కరణలో శరవేగంగా దూసుకుపోతున్న చైనా, మరో మహాద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను విజయవంతంగా వినియోగంలోకి తెచ్చింది.
Fastest Internet | బీజింగ్, నవంబర్ 15: అద్భుత టెక్నాలజీల ఆవిష్కరణలో శరవేగంగా దూసుకుపోతున్న చైనా, మరో మహాద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను విజయవంతంగా వినియోగంలోకి తెచ్చింది. ఇది ఎంత వేగవంతమైందంటే.. ఒక సెకనులో 150 సినిమాలను డౌన్లోడ్ చేయవచ్చు. సెకనులో 1.2 టెరాబైట్ (టీబీ) డాటాను ఈ నెట్వర్క్ ద్వారా విజయవంతంగా సరఫరా చేశారు. అంటే సెకనులో 1200 గిగాబైట్ (జీబీ) డాటా అన్నమాట.
ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక ఇంటర్నెట్ టెక్నాలజీ అత్యధికంగా సెకనుకు 100 జీబీ డాటాను మాత్రమే మార్పిడి చేయగలదు. ఇటీవల అమెరికా సెకనుకు 400 జీబీ డాటాను మార్పిడి చేయగల నెట్‌వర్క్‌ను నిర్మించింది. దీంతో పోల్చితే చైనా నెట్వర్క్ నాలుగింతలు. ఈ నెట్వర్క్ నిర్మాణం కోసం చైనా పదేండ్లుగా పరిశోధన చేస్తున్నది. ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను బీజింగ్, వుహాన్, గాంగ్ఝౌ మధ్య 3000 కిలోమీటర్ల పొడవున ఏర్పాటుచేశారు. సింఝువా యూనివర్సిటీ, హువావే టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్ కలిసి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించినట్టు సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తెలిపింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

