8 ఏండ్ల వయసులోనే కోడింగ్‌పై ఆసక్తి : చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్ ఎదిగిన తీరిదే..!
చాట్‌జీపీటీ ఆవిష్కరణ టెక్ ప్రపంచంలో పెనుప్రకంపనలు సృష్టిస్తుండటంతో దీని వెనుక ఉన్న శ్యామ్యూల్ ఆల్ట్‌మన్ పేరు తెరపైకి వచ్చింది.
న్యూయార్క్ : టెక్ ప్రపంచంలో చాట్‌జీపీటీ సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించగా గూగుల్, ఒపెరా వంటి కంపెనీలు సైతం ఏఐ రేసులో గ్రాండ్ ఎంట్రీకి కసరత్తు సాగిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌పై ఎప్పటినుంచో టెక్ కంపెనీలు దృష్టి సారించినా చాట్‌జీపీటీకి ప్రజల నుంచి అనూహ్య ఆదరణ లబించిన అనంతరం సరికొత్త ఏఐ టూల్‌పై హాట్ డిబేట్‌కు తెరలేచింది. విద్యార్ధుల నుంచి కంటెంట్ క్రియేటర్ల వరకూ పెద్దసంఖ్యలో యూజర్లు చాట్‌జీపీటీని వాడుతున్నారు.
ఓపెన్ఏఐ వెబ్‌సైట్‌ను సందర్శించి పెయిడ్ వెర్షన్‌ను సైతం యూజర్లు యాక్సెస్ చేస్తున్నారు. చాట్‌జీపీటీ ఆవిష్కరణ టెక్ ప్రపంచంలో పెనుప్రకంపనలు సృష్టిస్తుండటంతో దీని వెనుక ఉన్న శ్యామ్యూల్ ఆల్ట్‌మన్ పేరు తెరపైకి వచ్చింది. చాట్‌జీపీటీ మాతృసంస్ధ ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ 2015లో బిలియనీర్ ఎలన్ మస్క్‌తో కలిసి ఓపెన్ఏఐని నెలకొల్పాడు. చిన్నతనం నుంచే శామ్ టెక్నాలజీ పట్ల విపరీతమైన ఆసక్తి కనబరిచేవాడు.
బాల్యంలోనే కోడింగ్, ప్రోగ్రామింగ్‌పై పట్టు
ఎనిమిదేండ్ల వయసులోనే శామ్ ప్రోగ్రామింగ్ చేయడం ప్రారంభించాడు. అమెరికాలోని మిస్సోరి, సెంట్ లూయిస్‌లో పెరిగిన శామ్ చిరుప్రాయంలోనే కోడింగ్ పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. ప్రోగ్రామింగ్‌లో పట్టు సాధించగా అదే అతడి జీవనాధారంగా మారడంతో పాటు వినూత్న ఆవిష్కరణలకు బీజం వేసింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తిచేసిన తర్వాత శామ్ మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి లూప్ట్ అనే యాప్‌పై పనిచేసేందుకు కాలేజ్ నుంచి డ్రాపవుట్ అయ్యాడు. ఆపై వారు ఆ కంపెనీని 43 మిలియన్ డాలర్లకు వేరొకరికి విక్రయించారు. శామ్ లూప్ట్ సహవ్యవస్ధాపకుల్లో ఒకరితో తొమ్మిదేండ్ల పాటు డేటింగ్ చేసి ఆపై ఇద్దరూ పరస్పరం విడిపోయారని న్యూ యార్కర్ తెలిపింది. ఆ రోజుల్లో స్వలింగ సంపర్కలుగా సమాజంలో నెగ్గుకురావడం ఏమంత సులభం కాదని న్యూ యార్కర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్ చెప్పుకొచ్చాడు.
మస్క్‌తో కలిసి ఓపెన్ఏఐకి శ్రీకారం
లూఫ్ట్ను విక్రయించిన అనంతరం హైడ్రాజిన్ క్యాపిటల్‌ను స్ధాపించిన శామ్ 2014లో వై కాంబినేటర్ ప్రెసిడెంట్ అయ్యాడు. అదే ఏడాది శామ్ ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లెక్చర్ ఇచ్చాడు. వై కాంబినేటర్ ఎయిర్‌బీఎన్‌బీ, రెడిట్, కోరా వంటి కంపెనీలకు పునాదిగా నిలిచింది. ఇక 2015లో శామ్ లాభాపేక్ష లేని రీసెర్చి కంపెనీగా మస్క్‌తో కలిసి ఓపెన్ఏఐని ప్రారంభించాడు. స్పేస్ ఎక్స్, టెస్లా వంటి తన కంపెనీలు ఏఐ టెక్నాలజీస్‌పై పనిచేస్తుండటంతో 2018లో ఓపెన్ఏఐ నుంచి మస్క్ వైదొలగాడు. 2019లో లాభాపేక్ష కంపెనీగా ప్రకటించిన ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలతో చేతులు కలిపి ఏఐ టూల్స్‌లో చాట్‌జీపీటీ వంటి వినూత్న ఆవిష్కరణలను చేపట్టింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

