Chandrayan-3 | విజయవంతంగా చంద్రయాన్-3 కక్ష్య పెంపు..!
Chandrayan-3 | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు రెండుసార్లు కక్ష్యను నౌక విజయవంతంగా పెంచగా.. మంగళవారం మరోసారి మూడోసారి కక్ష్యను (ఎర్త్ బౌండ్ ఆర్బిట్ మ్యాన్యువర్) పెంచినట్లు ఇస్రో తెలిపింది.
Chandrayan-3 | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు రెండుసార్లు కక్ష్యను నౌక విజయవంతంగా పెంచగా.. మంగళవారం మరోసారి మూడోసారి కక్ష్యను (ఎర్త్ బౌండ్ ఆర్బిట్ మ్యాన్యువర్) పెంచినట్లు ఇస్రో తెలిపింది. బెంగళూరు నుంచి ఈ విన్యాసాన్ని నిర్వహించినట్లు పేర్కొంది. ప్రస్తుతం చంద్రయాన్-3 భూమికి 41,603 కిమీ x 226 కిమీ దూరంలో ఉన్న భూ కక్ష్యలో ఉందని ఇస్రో వివరించింది.
ఈ నెల 20న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో మరోసారి ఇంజిన్‌ను బర్న్ చేసి కక్ష్యను పెంచనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. చంద్రయాన్ నౌక భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నది. ప్రతి కక్ష్యతో శాటిలైట్ దూరాన్ని పెంచే ప్రక్రియ కొనసాగుతున్నది. చంద్రయాన్-3 భూమికి దగ్గరగా ఉండగా.. చంద్రుడికి వైపు వెళ్లడానికి ఇంజిన్లను మళ్లీ బర్న్ చేసి వరుసగా ఆటిట్యూడ్‌ను పెంచే ప్రక్రియ కొనసాగుతున్నది.
ఇది భూమి నుంచి చంద్రుడి వైపు మళ్లిన తర్వాత, చంద్రయాన్ 3లోని ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రునిపై అంతరిక్ష నౌక ఎత్తును తగ్గించడానికి మళ్లీ ఇలాంటి ప్రక్రియ చేపట్టి ల్యాండ్ అయ్యేందుకు వేగాన్ని తగ్గించనున్నారు. ఇక చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ వచ్చే నెల 5 నాటికి చంద్రుడి కక్షలోకి చేరుకుంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఆ తర్వాత ల్యాండింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా.. ఇస్రో జులై 14న చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగాప్రయోగించిన విషయం తెలిసిందే. చంద్రుడిపైకి ఇస్రో పంపిన మూడో మిషన్ ఇది. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ విజయవంతమైతే.. భారత్ విజయం సాధిస్తే ప్రపంచంలోనే నాలుగో దేశంగా భారత్ అవతరించనున్నది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

