న్యూఢి్లీ : ఆడియో కంపెనీ బౌల్ట్ వేరబుల్స్ సెగ్మెంట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. డ్రిఫ్ట్, కాస్మిక్ పేరుతో బౌల్ట్ రెండు స్మార్ట్‌వాచ్‌లను భారత్‌లో లాంఛ్ చేసింది. అందుబాటు ధరలో పలు హెల్త్ ఫీచర్లు, యాక్టివిటీ ట్రాకర్స్‌తో స్మార్ట్‌వాచ్‌లను ప్రవేశపెట్టింది. బౌల్ట్ డ్రిఫ్ట్, కాస్మిక్ వాచ్‌లు మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటాయని కంపెనీ చెబుతోంది.
ఐదేండ్ల పాటు ఆడియో ఉత్పత్తుల రంగంలో విజయవంతంగా సేవలందించిన బౌల్ట్ స్మార్ట్‌వాచ్ క్యాటగిరీలో ఎంటర్ అయిందని కంపెనీ సహ వ్యవస్ధాపకుడు, సీఎఫ్ఓ వరుణ్ గుప్తా తెలిపారు. జులై 3న డ్రిఫ్ట్‌ను లాంఛ్ చేశామని, ఈనెల 9న కాస్మిక్ కస్టమర్ల ముందుకు రానుందని వెల్లడించారు. మిలీనియల్స్ ఫిట్‌గా ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరించే ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మరికొన్ని వినూత్న స్మార్ట్‌వాచ్‌లను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టామని తెలిపారు. ఇక బౌల్ట్ డ్రిఫ్ట్ స్మార్ట్‌వాచ్ రూ 1999కు అందుబాటులో ఉండగా కాస్మిక్ రూ 1499కి లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్కు ఈ స్మార్ట్‌వాచ్‌లు లభించనుండగా బౌల్ట్ డ్రిఫ్ట్ బ్లూ, బ్లాక్, గ్రే వైట్ కలర్స్‌లో కాస్మిక్ రోజ్ గోల్డ్, బ్లూ, బ్లాక్ షేడ్స్‌లో కస్టమర్లను ఆకట్టుకుంటాయి.