Blue Moon: ఈరోజు ఆకాశంలో కనువిందు చేయనున్న బ్లూమూన్
రక్షాబంధన్నాడు ఆకాశంలో చంద్రుడు కనువిందు చేయనున్నాడు. ఆదివారం రాత్రి బ్లూమూన్ ( Blue Moon ) కనిపించనున్నట్లు అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ వెల్లడించింది.

వాషింగ్టన్: రక్షాబంధన్నాడు ఆకాశంలో చంద్రుడు కనువిందు చేయనున్నాడు. ఆదివారం రాత్రి బ్లూమూన్ ( Blue Moon ) కనిపించనున్నట్లు అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ వెల్లడించింది. ఒకవేళ ఆదివారం రాత్రి ఆకాశం మేఘావృతం కాకుండా ఉంటే.. అందరూ ఈ బ్లూమూన్ చూడొచ్చు. ఒక సీజన్లో సాధారణంగా మూడు పౌర్ణములు ఉంటాయి. అయితే నాలుగు పౌర్ణములు ఉండే సీజన్లో వచ్చే మూడో పౌర్ణమిని బ్లూమూన్ అంటారు. నాసా ప్రకారం.. రెండు రకాల బ్లూమూన్స్ ఉంటాయి. ఒకటి నెలవారీగా, మరొకటి సీజనల్‌గా వచ్చే బ్లూమూన్.
చంద్రుడు నీలి రంగులో కనిపిస్తాడా?
ఒక కేలండర్ నెలలో రెండు పౌర్ణములు వస్తే.. అందులో రెండో పౌర్ణమిని బ్లూమూన్ అంటారు. ఇక సీజనల్ బ్లూమూన్ అంటే.. ఒక ఆస్ట్రానామికల్ సీజన్లో ఒకవేళ నాలుగు పౌర్ణములు వస్తే.. అందులో వచ్చే మూడో పౌర్ణమిని సీజనల్ బ్లూమూన్ అంటారు. 1528లో తొలిసారి ఈ బ్లూమూన్ రికార్డయినట్లు నాసా తెలిపింది. సగటును ఒక ఫుల్ బ్లూమూన్ 2.7 ఏళ్లకు ఒకసారి వస్తుందని స్కై&టెలిస్కోప్ మ్యాగజైన్ వెల్లడించింది.
అయితే చంద్రుడు నీలి రంగులో కనిపించడం మాత్రం అత్యంత అరుదుగా జరుగుతుంది. అగ్నిపర్వతాలు పేలినప్పుడు లేదా అడవుల్లో కార్చిచ్చు రగిలినప్పుడు భారీ ఎత్తున పొగ, దుమ్ముదూళి వాతావరణంలోకి వెళ్లినప్పుడు చంద్రుడు నీలి రంగులో కనిపిస్తాడు. ఇండియాలో నిండు చంద్రుడిని అర్ధరాత్రి 12 గంటల సమయంలో చూడొచ్చు. తర్వాతి బ్లూమూన్ 2024, ఆగస్ట్‌లో కనిపించనుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

