Free Video Editing Apps : యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారా? ఈయాప్స్తో ఉచితంగా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు
ఇది డిజిటల్ యుగం. ఈ జనరేషన్ యూత్ ఎక్కువగా సోషల్ మీడియాలోనే గడుపుతోంది. పొద్దున లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే సమయం వరకు.. యూత్ ఎక్కువగా సోషల్ మీడియానే ఫాలో అవుతోంది. అందుకే.. సోషల్ మీడియాకు అంత పాపులారిటీ వచ్చేసింది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల కాలంలో ఉండటంతో.. అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం. కొందరైతే.. తాము చేసే ప్రతి పనిని.. సోషల్ మీడియాతో పంచుకుంటారు.

సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా సైట్లలో ఏదో సరదాకు పోస్టులు పెట్టేవాళ్లు ఉన్నారు. అలాగే.. యూట్యూబ్‌లో చానెల్ ఓపెన్ చేసి వీడియోలు పెట్టి.. డబ్బులు సంపాదించేవాళ్లూ ఉన్నారు. ఒకవేళ మీకు యూట్యూబ్ చానెల్ ఉంటే.. యూట్యూబ్ చానెల్లో వీడియోలు అప్లోడ్ చేస్తుంటే.. ఆ వీడియోలను ఇంకా ఆకర్షణీయంగా తయారు చేసేందుకు.. యూట్యూబ్ యూజర్లను మరింత ఆకర్షించేందుకు ఈ వీడియో ఎడిటింగ్ యాప్స్‌ను ఉపయోగించి వీడియోలను ఎడిట్ చేసుకోండి. అది కూడా ఉచితంగా.. ప్రతి వీడియో ఎడిటింగ్ యాప్ ప్రీమియం వర్షన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా వీడియోలను బెస్ట్‌గా ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ లేటెస్ట్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలంటే మాత్రం ప్రీమియం వర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Kinemaster Mobile Video Editor

వీడియో ఎడిటింగ్ అనగానే గుర్తొచ్చే పేరు కైన్ మాస్టర్. యూట్యూబ్ వీడియో ఎడిటింగ్‌కు చాలామంది ఈయాప్నే ఉపయోగిస్తారు. ఈ యాప్ ఫ్రీ వర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. లేటెస్ట్ ఫీచర్స్ కావాలంటే మాత్రం.. ప్రీమియం వర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్, క్రోమ్ ఓఎస్, ఐవోఎస్ ఓఎస్‌లో ఇది అందుబాటులో ఉంటుంది. ఇందులో చాలా ఎడిటింగ్ ఫీచర్స్ ఉంటాయి. యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ కోసం.. ఇది బెస్ట్ అండ్ సూటబుల్ యాప్. కాకపోతే ఫ్రీ వర్షన్లో మాత్రం కైన్‌మాస్టర్ వాటర్‌మార్క్ అలాగే ఉంటుంది. అది వద్దు అనుకుంటే.. ప్రీమియం వర్షన్ తీసుకోవచ్చు.
PowerDirector

4కే రిజల్యూషన్ ఉన్న వీడియోలను ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే.. పవర్ డైరెక్టర్ వీడియో ఎడిటింగ్ యాప్ బెస్ట్. దీంట్లో కూడా బెస్ట్ వీడియో ఎడిటింగ్ ఫీచర్స్ఉంటాయి.
Inshot

ఎక్కువ మంది యూట్యూబ్ వీడియో క్రియేటర్లు వాడుతున్న యాప్.. ఇన్షాట్. ఇదే ఇప్పుడు పాపులర్. క్విక్ వీడియోలను క్రియేట్ చేయాలంటే.. ఇన్షాట్ బెస్ట్ ఆప్షన్. ఇందులో వీడియో ఎడిటింగ్ ఆప్షన్స్ కూడా చాలా ఈజీగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి.
GoPro Quick

కొందరికి వీడియో ఎడిటింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. వీడియో ఎడిటింగ్ ఓనమాలు నేర్చుకునే వాళ్లు కూడా ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు. ఇందులో వీడియో ఎడిటింగ్ ఫీచర్లు చాలా ఈజీగా ఉంటాయి. వీడియో ఎడిటింగ్ గురించి బేసిక్ ఐడియా కావాలంటే.. ఈ యాప్‌ను ఉపయోగించండి.
Clips

క్లిప్స్ యాప్.. ఐఫోన్ యూజర్ల కోసం మాత్రమే డెవలప్ చేసిన యాప్. ఇది కేవలం ఐవోఎస్ ఓఎస్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే.. ఇందులో కూడా బెస్ట్ ఎడిటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎడిటింగ్ లో బేసిక్ నుంచి మాస్టర్ అయ్యేందుకు కావాల్సిన అన్ని ఫీచర్లు ఇందులో లభిస్తాయి.
ActionDirector

ఆండ్రాయిడ్ ఫోన్లలో వీడియో ఎడిట్ చేసేవాళ్లు.. ఎక్కువగా యాక్షన్ డైరెక్టర్ యాప్‌ను వాడుతుంటారు. ఇందులో ఎడిటింగ్ ఆప్షన్లు చాలా ఈజీగా ఉంటాయి.
Vimeo

విమియో కూడా ఫేమస్ యాపే. వీడియోలను ట్రిమ్ చేయాలన్నా.. ఎఫెక్ట్స్ యాడ్ చేయాలన్నా.. టెక్స్ట్ యాడ్ చేయాలన్నా.. ఇలాంటి బేసిక్ వీడియో ఎడిటింగ్ ఆప్షన్ల కోసం విమియో యాప్‌ను ఉపయోగించవచ్చు.
FilmoraGo

బేసిక్ వీడియో ఎడిటింగ్ స్కిల్స్ కోసం ఈ యాప్‌ను వాడొచ్చు. వీడియో ఎడిటింగ్ గురించి ఏమాత్రం తెలియకున్నా కూడా ఈ యాప్‌తో వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు.
Filmr

వీడియో ఎడిటింగ్ బేసిక్ స్టేజ్‌లో ఉన్నవాళ్లకు ఇది బెస్ట్ యాప్. యూట్యూబ్ కోసం.. క్వాలిటీ వీడియోలను తయారు చేయడం కోసం.. ఈ యాప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇతర సోషల్ మీడియా సైట్లలో వీడియోలను పోస్ట్ చేయడం కోసం కూడా ఈ యాప్‌ను ఉపయోగించి ఎడిట్ చేస్తారు.
Adobe Premiere Rush

అడోబ్ సంస్థకు సంబంధించిన వీడియో ఎడిటింగ్ యాప్ ఇది. ఇది క్రాస్ డివైజ్ వీడియో ఎడిటింగ్ యాప్. అంటే.. ఒకే వీడియోను ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మాక్ ఓఎస్‌లలో ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక ఓఎస్‌లో ఎడిట్ చేసిన వీడియోను మరో ఓఎస్లోకి ఎక్స్పోర్ట్ చేసుకొని ఎడిట్ చేసుకునే వెసులుబాటు.. అడోబ్ ప్రీమియర్ రష్లో ఉంటుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

