దూసుకెళ్తున్న పబ్జీ ఇండియా వర్షన్.. వారంలోనే 3 కోట్లకు పైగా డౌన్లోడ్లు
గేమింగ్ ప్రియులకు పబ్జీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో మొబైల్స్‌కు అతుక్కుపోయి మరీ ఈ గేమ్‌ను ఆడేవారు. కానీ భద్రత కారణాల రీత్యా పబ్జీని కేంద్రం ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో పబ్జీ ఇండియా వర్షన్‌ను బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్స్ ఇండియా పేరుతో తీసుకొస్తామని ప్రకటించింది.

BATTLEGROUNDS | గేమింగ్ ప్రియులకు పబ్జీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో మొబైల్స్‌కు అతుక్కుపోయి మరీ ఈ గేమ్‌ను ఆడేవారు. కానీ భద్రత కారణాల రీత్యా పబ్జీని కేంద్రం ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో పబ్జీ ఇండియా వర్షన్‌ను బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్స్ ఇండియా పేరుతో తీసుకొస్తామని ప్రకటించింది. అన్ని అడ్డంకులను దాటుకుని జూలై 2న ఈ గేమ్ విడుదలైంది. అయితే ఈ గేమ్ లాంఛ్ అయిన వెంటనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ప్లే స్టోర్‌లో ఈ యాప్ దూసుకెళ్తోంది.
ప్లే స్టోర్‌లో ఈ వారం టాప్ ఫ్రీ గేమ్స్‌లో టాప్‌లో నిలిచింది. కేవలం పదిరోజుల్లోనే ప్లే స్టోర్ నుంచి ఈ గేమ్‌ను 3.4కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ గేమ్‌కు 1.6 కోట్ల మంది డైలీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నారని క్రాప్టన్ సంస్థ తెలిపింది. ఈ బ్యాటిల్ గ్రౌండ్ గేమ్‌కు వస్తున్న ఆదరణ పట్ల ఆ ఆ సంస్థ ఇండియా డివిజన్ హెడ్ వూ యెల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ గేమ్ మరింత దూసుకెళ్తుందని అంచనా వేస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరింత వినోదభరిత కంటెంట్‌ను గేమ్‌లో యాడ్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ బాటిల్‌గ్రౌండ్ మొబైల్స్ ఇండియా గేమ్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మాత్రమే విడుదలైంది. ఐవోఎస్ వర్షన్ ఇంకా రెడీ అవ్వలేదు. కాగా, యూట్యూబ్‌లో జూలై 8న నిర్వహించిన గేమ్ లాంచ్ పార్టీ, టోర్నమెంట్‌ను 50 లక్షల మంది చూశారని క్రాప్టన్ సంస్థ ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
గూగుల్‌లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
3జీ, 4జీ, 5జీ తెలుసు.. మరి ‘జీరో’ జీ ఉందని తెలుసా !
త్వరలో మార్కెట్ లోకి…వన్‌ప్లస్ నార్డ్-2
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- battleground
- Games
- PUBG
- tech news
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

