ఇక పవర్ బ్యాంక్‌తో పనిలేదు.. చేతివేళ్లతోనే ఫోన్ చార్జింగ్ చేయొచ్చు !
చేతి వేళ్ల సాయంతో పవర్‌ను ఉత్పత్తి చేసే పరికరమే ‘ఫింగర్ స్ట్రిప్' చార్జర్. వేళ్లకు ప్లాస్టర్ మాదిరిగా దీన్ని చుట్టుకోవచ్చు. వేళ్ల మీది చెమటతో ఇది విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తుంది.
ధరణి ఓ ఈవెంట్ సంస్థలో పబ్లిసిటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వర్చువల్‌గా రోజూ ఏడెనిమిది కాన్ఫరెన్సులకు హాజరవుతారు. అయితే, మీటింగ్ మధ్యలో తరుచూ మొబైల్/ల్యాప్‌టాప్‌కి చార్జింగ్ అయిపోవడం ఇటీవల ఆమెకు ఇబ్బందిగా మారింది. ఎక్కడికి వెళ్లినా తనతోపాటు పవర్ బ్యాంక్‌ను తీసుకెళ్లడం సాధ్యపడటంలేదు. ధరణిలాగే చాలా మంది ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. దీనికి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు సులువైన పరిష్కారాన్ని కనిపెట్టారు. అదే ‘ఫింగర్ స్ట్రిప్’ చార్జర్.

ఏమిటీ ‘ఫింగర్ స్ట్రిప్’ చార్జర్?
చేతి వేళ్ల సాయంతో పవర్‌ను ఉత్పత్తి చేసే పరికరమే ‘ఫింగర్ స్ట్రిప్’ చార్జర్. వేళ్లకు ప్లాస్టర్ మాదిరిగా దీన్ని చుట్టుకోవచ్చు. వేళ్ల మీది చెమటతో ఇది విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తుంది.
వేటికి చార్జింగ్ పెట్టుకోవచ్చు?
మొబైల్స్, ల్యాప్‌టాప్, ట్యాబ్స్, వాచ్, ఐపాడ్స్, మ్యూజిక్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పియానో, బల్బులు వంటి వాటికి ఈ స్ట్రిప్ సాయంతో విద్యుత్‌ను అందించవచ్చు. రెండురోజులపాటు పది వేళ్లకు ఈ స్ట్రిప్‌లను ధరిస్తే ఫోన్ ఫుల్ చార్జింగ్ చేయొచ్చు.

వేళ్లపైనే ఈ చిప్ ఎందుకు?
శరీరంలో స్వేద గ్రంథులు ఎక్కువగా ఉన్న భాగాల్లో వేళ్లు ఒకటి. వేళ్ల ద్వారానే అత్యధికంగా చెమట విడుదల అవుతుంది. అయితే, వేళ్లకు గాలి ఎక్కువగా తగిలే అవకాశం ఉండటంతో స్వేదం త్వరగా ఆవిరైపోతుంది. దీంతో వేళ్లకు చెమట పట్టినట్టు అనిపించదు. వేళ్లకు ఈ స్ట్రిప్‌ను అమరిస్తే ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
పవర్‌ను ఎలా ఉత్పత్తి చేస్తుంది?
‘ఫింగర్ స్ట్రిప్’ చార్జర్‌లో కార్బన్ ఫోమ్ ఎలక్ట్రోడ్లు, ఆక్సిజన్, లాక్టేట్ వంటి ఎంజైమ్‌లు ఉంటాయి. అవి వేళ్ల మీద పుట్టిన స్వేద బిందువులను గ్రహించినపుడు రసాయనిక చర్య జరిగి విద్యుత్ పుడుతుంది. స్ట్రిప్‌లోని కెపాసిటర్‌లో దీన్ని స్టోర్ చేస్తుంది. చిప్‌పై ఒత్తిడి పడితే కూడా పవర్ పుడుతుంది. దీనికి ఎలక్ట్రోడ్ కిందనున్న ‘పైజోఎలక్ట్రిక్’ సాయపడుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
గూగుల్‌లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
మల్టీపుల్ డివైజ్‌లలో వాట్సాప్.. బీటా యూజర్లకు కొత్త ఫీచర్
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
వాట్సాప్ ట్రిక్స్ : కాంటాక్ట్‌లో లేని నంబర్‌కు మెసేజ్ చేయడమెలా
దూసుకెళ్తున్న పబ్జీ ఇండియా వర్షన్.. వారంలోనే 3 కోట్లకు పైగా డౌన్లోడ్లు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

