Free AirPods with iPhone 12 : ఐఫోన్ 12 కొంటే రూ.15 వేల విలువైన ఎయిర్‌పాడ్స్ ఉచితం
ఐఫోన్ 12 కొంటే రూ.15 వేల విలువైన ఎయిర్‌పాడ్స్ ఉచితం | యాపిల్ ఐఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ఎయిర్‌పాడ్స్ కూడా కావాలా? అయితే.. మీకు ఉన్న బెస్ట్ చాయిస్ ఏంటో తెలుసా?
యాపిల్ ఐఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ఎయిర్‌పాడ్స్ కూడా కావాలా? అయితే.. మీకు ఉన్న బెస్ట్ చాయిస్ ఏంటో తెలుసా? ఐఫోన్ 12 కొంటే.. 15 వేల రూపాయల విలువైన యాపిల్ ఎయిర్‌పాడ్స్ ఉచితంగా లభిస్తాయి. త్వరలో ఫెస్టివల్ సీజన్ రాబోతున్న సందర్భంగా ఇండియా యూజర్ల కోసం యాపిల్ ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

అక్టోబర్ 7 నుంచి యాపిల్ ఇండియా స్టోర్‌లో దివాళీ ఫెస్టివల్ ఆఫర్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 7 నుంచి నవంబర్ 4 వరకు ఈ ఆఫర్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ మీద ఆఫర్లను యాపిల్ ప్రకటించింది. యాపిల్ ఇండియా స్టోర్‌లో దివాళీ సేల్‌లో ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ కొనుగోలు చేసే యూజర్లకు ఎయిర్‌పాడ్స్‌ను ఉచితంగా అందిస్తారు.

ఐఫోన్ 13 విడుదల తర్వాత ఐఫోన్ 12 ధరలను యాపిల్ తగ్గించింది. ఐఫోన్ 12, 64 జీబీ మోడల్ ధర రూ.65,900 కాగా.. 128 జీబీ స్టోరేజ్ ధర రూ.70,900, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.80,900గా ఉంది. ఐఫోన్ మినీలో 64 జీబీ వేరియంట్ ధర రూ.59,900 కాగా.. 128 జీబీ వేరియంట్ ధర రూ.64,900, 256 జీబీ వేరియంట్ ధర రూ.74,900 గా ఉంది.

దివాళీ ఫెస్టివల్ సీజన్ లో ఉచితంగా యాపిల్ ఎయిర్ పాడ్స్ ను సొంతం చేసుకోవాలనుకుంటే.. వెంటనే అక్టోబర్ 7నే యాపిల్ ఇండియా స్టోర్ https://www.apple.com/in/store వెబ్ సైట్ కు లాగిన్ అవండి. స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది కాబట్టి.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఐఫోన్ 12ను కొనుగోలు చేసి ఎయిర్ పాడ్స్ ను ఉచితంగా పొందండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
iPhone SE : ఐఫోన్ ఎస్ఈపై భారీ డిస్కౌంట్.. 18 వేలకే ఫోన్.. ఆర్డర్ చేసుకోండిలా
iOS 15 : ఐవోఎస్ 15కు అప్‌గ్రేడ్ అయ్యారా? మీకు తెలియని ఈ బెస్ట్ ఫీచర్ల గురించి తెలుసుకోండి
Xiaomi Civi : అద్భుతమైన ఫీచర్లతో ‘జియోమీ సివి’ స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?
Google Pixel 6 and 6 Pro : అత్యాధునికమైన కెమెరా ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ ఫోన్లు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

