Apple Stop Credit Card Payments | క్రెడిట్ కార్డు చెల్లింపులకు ఆపిల్ నో.. ఎందుకని?!
Apple Stop Credit Card Payments | ఆర్బీఐ యూపీఐ ఆటో పే విధానంతో క్రెడిట్ కార్డుల నుంచి చెల్లింపులను ఆపిల్ అనుమతించడం లేదు.
Apple Stop Credit Card Payments | భారత్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల క్రెడిట్ కార్డులను ఉపయోగించి యాప్‌ల కొనుగోళ్లు, సబ్స్క్రిప్షన్ల పేమెంట్లను ఆపిల్ నిలిపివేసింది. అంతే కాదు జూన్ ఒకటో తేదీ నుంచి క్రెడిట్ కార్డుల యాడ్ క్యాంపెయిన్లకు చెల్లింపులను అనుమతించడం లేదు. గతేడాది ఆర్బీఐ అమల్లోకి తీసుకొచ్చిన ఆటో డెబిట్ విధానమే దీనికి కారణం. ఈ విధానం వల్ల రికరింగ్ ఆన్లైన్ లావాదేవీల్లో అంతరాయం ఏర్పడుతున్నదని విమర్శలు ఉన్నాయి. ఆర్బీఐ జారీ చేసిన రెగ్యులేషన్ల వల్ల భారత్‌లోని బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డుల నుంచి ఆపిల్ సెర్చ్ యాడ్స్‌కు చెల్లింపులను అనుమతించబోమని తన యూజర్లకు ఆపిల్ పంపిన ఈ-మెయిల్ సందేశంలో తెలిపింది. జాన్ ఒకటో తేదీ నుంచి భారత్‌లోని బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డుల క్యాంపెయిన్లన్నీ హోల్డ్‌లో ఉంచుతామని తెలిపింది. భారత్ బయట బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డులను వాడుతూ మీ కస్టమర్లకు యాడ్స్ అందుబాటులోకి తేవాలని సూచించింది.
ఆపిల్ తాజా నిర్ణయం వల్ల యూజర్లు ఐ-క్లౌడ్ వంటి ఆపిల్ సబ్స్క్రిప్షన్లకు చెల్లింపులు చేయలేకపోతున్నారు. ఆపిల్ ఐడీ ఖాతాల నుంచి కూడా పేమెంట్స్ చేయలేకపోతున్నారు యూజర్లు. గత నెల నుంచి భారతీయ యూజర్లు కేవలం యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆపిల్ ఐడీ ఖాతా ద్వారా చెల్లింపులు చేయడానికి అనుమతిస్తున్నది. అయినా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.
ఆన్లైన్ పేమెంట్స్ విషయమై ఆపిల్ తెచ్చిన మార్పులపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయడానికి ప్రయత్నిస్తే దిస్ టైప్ కార్డ్ ఈజ్ నో లాంగర్ సపోర్టెడ్ అనే మెసేజ్‌లు వస్తున్నాయంటున్నారు. గూగుల్, ఫేస్బుక్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వంటి వేదికలు చెల్లింపుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. అయితే, మెటా (ఫేస్బుక్), గూగుల్ తమ యూజర్లకు ఇతర పేమెంట్ ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ తన సమస్యను అధిగమించింది.
ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఆపిల్, మెటా, ఓటీటీ ప్లేయర్లు, ఇతర మర్చంట్స్ ఈ-మాండేట్ గురించి కస్టమర్లను అలర్ట్ చేశాయి. రికరింగ్ పేమెంట్స్ కోసం కస్టమర్లు 2-ఫ్యాక్టర్ అథంటికేసన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అంతే కాదు కస్టమర్ ప్రతి సారి రూ.5000కి పైగా చేసే చెల్లింపులకు తమ కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

