యాంటీ ఇన్ఫ్లమేషన్ డ్రగ్‌తో చిన్నారుల్లో కొవిడ్‌కు చెక్..!
Anti Inflamation drug: ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి వాడే కార్టికో స్టెరాయిడ్లు కొవిడ్ బాధిత చిన్నారుల్లో చికిత్సకు ఉపయోగపడతాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనం ద్వారా తేల్చారు.

లండన్: యాంటీ ఇన్ఫ్లమేషన్ డ్రగ్‌తో చిన్నారుల్లో కొవిడ్‌కు చెక్ పెట్టవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి వాడే కార్టికో స్టెరాయిడ్లు కొవిడ్ బాధిత చిన్నారుల్లో చికిత్సకు ఉపయోగపడతాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనం ద్వారా తేల్చారు. కొవిడ్ బారినపడిన 50 వేల మంది చిన్నారుల్లో ఒకరికి మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ (ఎంఐఎస్-సి) అనే రుగ్మత వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
వైరస్ సోకిన 2-6 వారాల్లో ఈ రుగ్మత తలెత్తవచ్చునని, ఫలితంగా బాధితుల్లో తీవ్ర జ్వరం, ఉదర భాగంలో నొప్పి, వాంతులు, కళ్లు ఎర్రబారడం, చర్మంపై ఎర్రటి దద్దుర్లు వంటివి వస్తాయని, రక్త నాళాలు వ్యాకోచం చెందుతాయని తెలిపారు. ఈ రుగ్మతతో మరణం సంభవించే అవకాశం కూడా ఉన్నదని పేర్కొన్నారు. దీనికి యాంటీబాడీ చికిత్సకు బదులుగా చౌకలో, విస్తృతంగా అందుబాటులో ఉన్న చికిత్సా సాధనంగా స్టెరాయిడ్లు ఉపయోగపడతాయని పరిశోధనకు నాయకత్వం వహించిన ఎలిజబెత్ విటేకర్ తెలిపారు.
పరిశోధనలో భాగంగా తాము మిథైల్ ప్రెడ్నిసోలెన్ వంటి కార్టికో స్టెరాయిడ్లను, యాంటీబాడీ చికిత్సను పోల్చి చూశామని పరిశోధకులు తెలిపారు. యాంటీబాడీలు మాత్రమే పొందినవారు, యాంటీబాడీలతో కలిపి కార్టికో స్టెరాయిడ్లు పొందినవారు, కేవలం కార్టికో స్టెరాయిడ్లు పొందినవారు.. ఇలా మూడు రకాల చికిత్స మార్గాలను శాస్త్రవేత్తలు పరిశీలించి, ఈ మూడు రకాలూ సమర్థంగానే పనిచేశాయని తేల్చారు.
అయితే యాంటీబాడీలు మాత్రమే పొందినవారితో పోలిస్తే స్టెరాయిడ్లు మాత్రమే పొందినవారిలో అవయవాల వైఫల్య రేటు, మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. దీనికితోడు యాంటీబాడీల లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో కార్టికో స్టెరాయిడ్లు మెరుగైన చికిత్స మార్గమవుతాయని తెలిపారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

