Amazon Mobile Savings Days : బడ్జెట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? మొబైల్ సేవింగ్స్ సేల్‌లో భారీ డిస్కౌంట్లు
బడ్జెట్లో మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారా? బెస్ట్ ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఇదే మంచి తరుణం. అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఆగస్టు 16 నుంచి ఆగస్టు 19 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇది కేవలం మొబైల్స్ కోసం నిర్వహిస్తున్న సేల్. మొబైల్స్, వాటి యాక్సెసరీస్‌ను భారీ డిస్కౌంట్లతో పొందే చాన్స్ ఉంది. ఫోన్స్, వాటి యాక్సెసరీస్ మీద ఈ సేల్‌లో 40 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు.

అలాగే.. 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్స్ కూడా లభించనున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 1250 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్ లభించనుంది. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్లను ఈ సెల్లో అందిస్తున్నారు.
భారీ డిస్కౌంట్లను ప్రకటించిన ఫోన్లు ఇవే
వన్‌ప్లస్, జియోమీ, సామ్సంగ్, ఐక్యూ, రియల్మీ లాంటి బ్రాండ్ల మీద భారీ డిస్కౌంట్లను అమెజాన్ ప్రకటించింది. వన్‌ప్లస్ 9ఆర్, వన్‌ప్లస్ నోర్డ్ 2, వన్‌ప్లస్ నోర్డ్ సీఈ, రెడ్మీ నోట్ 10 సిరీస్, రెడ్మీ 9 సిరీస్, ఎంఐ 11ఎక్స్ సిరీస్, సామ్సంగ్ గెలాక్సీ ఎమ్ 21 2021 ఎడిషన్, సామ్సంగ్ గెలాక్సీ ఎమ్32, సామ్సంగ్ గెలాక్సీ ఎమ్31, రియల్మీ ఎక్స్7, ఐక్యూ7 సిరీస్, ఐక్యూ జెడ్3 లాంటి ఫోన్లను భారీ ఆఫర్లతో అందిస్తున్నారు.
వన్‌ప్లస్9 ఫోన్ మీద స్పెషల్ ఆఫర్
వన్‌ప్లస్9 మోడల్ ఫోన్ ఎంఆర్పీ ధర రూ.45,999 కాగా.. దాని మీద ప్రత్యేకమైన రూ.4000 డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. అలాగే.. వన్‌ప్లస్9 మోడల్‌పై 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తోంది. ఇతర బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరో రూ.3000 వరకు డిస్కౌంట్ లభించనుంది.
ఎంఐ 11 ఎక్స్‌పై ఎక్స్ఛేంజ్లో ఎక్స్ట్రా 5000 రూపాయల డిస్కౌంట్ లభిస్తోంది. రెడ్మీ నోట్ 10 ఫోన్‌పై కూడా బ్యాంక్ ఆఫర్లను ప్రకటించింది. ఒప్పో ఎఫ్ 17 ఫోన్‌ను 2000 రూపాయల స్పెషల్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయొచ్చు.
సామ్సంగ్ గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్, సామ్సంగ్ గెలాక్సీ ఎమ్31, సామ్సంగ్ గెలాక్సీ ఎమ్32 మోడల్స్‌ను 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో కొనుగోలు చేయొచ్చు. రిలయ్‌మీ ఎక్స్7, ఐక్యూ7, ఐఫోన్ ఎక్స్ఆర్ మీద 10 శాతం వరకు బ్యాంక్ ఆఫర్ల ద్వారా అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే.. మొబైల్ యాక్సెసరీస్ 69 రూపాయల నుంచి 399 రూపాయల రేంజ్‌తో లభిస్తాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

