Amazon Mega Electronic Days Sale 2025 | ఈ-కామర్స్ సంస్థలు ఎప్పటికప్పుడు ప్రత్యేక సేల్‌లను నిర్వహిస్తూ ఆకర్షణీయమైన డీల్స్‌ను, భారీ డిస్కౌంట్లను అందజేస్తున్నాయి. ఇటీవలే అమెజాన్ సంస్థ ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించిన విషయం విదితమే. కేవలం ప్రైమ్ మెంబర్లకు మాత్రమే సదరు సేల్‌ను నిర్వహించారు. అయితే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్‌ను తాజాగా ప్రారంభించింది. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఇతర ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నారు. హెడ్ ఫోన్స్, ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు వంటి ప్రొడక్ట్స్‌ను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. డెల్, సోనీ, శాంసంగ్ కంపెనీలకు చెందిన ఉత్పత్తులపై ఆఫర్లను అందిస్తున్నారు. చాలా వరకు ప్రొడక్ట్స్‌పై 75 శాతం వరకు రాయితీని అందిస్తున్నారు.
ఈ సేల్‌లో భాగంగా హెచ్‌పీ15 ఏఎండీ రైజెన్ 3 7320యు ల్యాప్‌టాప్‌ను రూ.29,990కే కొనుగోలు చేయవచ్చు. ఏసర్ ఆస్పయిర్ లైట్ థిన్ ల్యాప్ టాప్‌ను రూ.32,990కి అందిస్తున్నారు. డెల్ ఇన్స్పిరాన్ 3535 ల్యాప్‌టాప్‌ను రూ.40,990కి కొనవచ్చు. అసుస్ వివోబుక్ 15 ల్యాప్ టాప్ ధర రూ.50,990గా ఉంది. ఏసర్ ఏఎల్జీ గేమింగ్ ల్యాప్‌టాప్ ధర రూ.55,990గా ఉంది. హెచ్‌పీ 15 ఇంటెల్ కోర్ ఐ5 1334యు ల్యాప్‌టాప్‌ను రూ.54,990 ధరకు అందిస్తున్నారు. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్ టాప్ ధర రూ.61,990గా ఉంది. అసుస్ టఫ్ గేమింగ్ ఎ15 ల్యాప్‌టాప్ ధర రూ.65,990గా ఉంది. ఏసర్ నైట్రో వి16 ల్యాప్‌టాప్‌ను రూ.75,992 ధరకు అందిస్తున్నారు. అసుస్ గేమింగ్ వి16 (2025) ల్యాప్ టాప్ ధర రూ.87,990 ఉండగా, ఎంఎస్ఐ సైబోర్గ్ 15 ఏఐ గేమింగ్ ల్యాప్ టాప్ ధర రూ.80,991 గా ఉంది.
ఈ సేల్‌లో భాగంగా పలు కంపెనీలకు చెందిన హెడ్ ఫోన్స్‌పై కూడా భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు. నాయిస్ బడ్స్ ఎన్1 ప్రొ, బౌల్ట్ ఎక్స్ ముస్తాంగ్ టార్క్ వైర్లెస్ ఇన్ ఇయర్ బడ్స్, జేబీఎల్ వైబ్ బీమ్, స్కల్ క్యాండీ డైమ్ 3, జేబీఎల్ వేవ్ బడ్స్ 2, నాయిస్ మాస్టర్ బడ్స్ సౌండ్, మార్షల్ మేజర్ ఐవీ, మార్షల్ మేజర్ వి, బోస్ న్యూ క్వయిట్ కంఫర్ట్, సోనీ డబ్ల్యూహెచ్-1000ఎక్స్ఎం4 వంటి ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్‌ను భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. అలాగే వన్‌ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్‌ను రూ.15,999కు విక్రయిస్తున్నారు. షియోమీ ప్యాడ్ 6 ట్యాబ్ ధర రూ.23,999గా ఉంది. రెడ్మీ ప్యాడ్ ప్రొ 5జి ట్యాబ్ ధర రూ.23,999 ఉండగా, షియోమీ ప్యాడ్ 7 ట్యాబ్ ధర రూ.26,999గా ఉంది. లెనోవో ఐడియా ట్యాబ్ ప్రొ ధర రూ.27,999 ఉండగా, లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ ఏఐ ట్యాబ్లెట్ ధర రూ.44,999గా ఉంది.
ఈ సేల్‌లో ఫైర్ బోల్ట్ మావెరిక్ స్మార్ట్ వాచ్‌ను రూ.1399కు కొనుగోలు చేయవచ్చు. రెడ్మీ వాచ్ 5 లైట్ ధర రూ.3,199గా ఉంది. నాయిస్ దివా 2 ఫ్యాషన్ స్మార్ట్ వాచ్ ధర రూ.3,999 ఉండగా, నాయిస్ ఆరిజిన్ ఈఎన్1 వాచ్‌ను రూ.5499కు, అమేజ్ ఫిట్ యాక్టివ్ వాచ్‌ను రూ.7,499కు అందిస్తున్నారు. అమేజ్‌ఫిట్ జీటీఆర్ 4 వాచ్ ధర రూ.14,999గా ఉంది. వన్ ప్లస్ వాచ్ 2ఆర్ ధర రూ.14,999 ఉండగా, గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ ఎల్టీఈ స్మార్ట్ వాచ్ ధర రూ.19,999గా ఉంది. అలాగే డిజిటల్ కెమెరాలపై కూడా భారీ రాయితీలను, ఆకట్టుకునే డీల్స్‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో ఉత్పత్తులను హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.5750 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. మరిన్ని వివరాలకు అమెజాన్ లో మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్ పేజ్‌ను వినియోగదారులు సందర్శించవచ్చు.