Rabbit R1 | స్మార్ట్‌ఫోన్‌ను మరిపించే నయా ఏఐ డివైజ్ : రూ. 16,500కే పాకెట్ సైజ్ పరికరం
స్మార్ట్‌ఫోన్‌లా అన్ని పనులు చక్కబెట్టే పాకెట్ సైజ్ ఏఐ డివైజ్ రాబిట్ ఆర్1ను (Rabbit R1) ఏఐ స్టార్టప్ రాబిట్ సీఈఎస్-2024 వేదికగా ఆవిష్కరించింది. లాంఛ్ చేసిన రోజే కంపెనీ ఏకంగా 10,000కుపైగా యూనిట్లను విక్రయించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.
న్యూయార్క్ : స్మార్ట్‌ఫోన్‌లా అన్ని పనులు చక్కబెట్టే పాకెట్ సైజ్ ఏఐ డివైజ్ రాబిట్ ఆర్1ను (Rabbit R1) ఏఐ స్టార్టప్ రాబిట్ సీఈఎస్-2024 వేదికగా ఆవిష్కరించింది. లాంఛ్ చేసిన రోజే కంపెనీ ఏకంగా 10,000కుపైగా యూనిట్లను విక్రయించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఏఐ డివైజ్ మెసేజ్‌లు పంపడం, కాల్స్ చేయడం, స్పాటిఫై, ఊబర్ వంటి సర్వీసులను యాక్సెస్ చేయడం వంటి పనలును ఇట్టే చక్కబెట్టేస్తుంది. రూ. 16,500కు లభించే రాబిట్ఆర్1 ప్రస్తుతం అమెరికాలో అందుబాటులో ఉండగా భారత్‌లో ఇది ఎప్పటి నుంచి లభిస్తుందనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
గేమ్ బాయ్ తరహాలో కనిపించే ఈ డివైజ్ స్క్వేర్ డిస్ప్లే కలిగిఉండి టచ్‌స్క్రీన్‌తో ఆకట్టుకుంటుంది. వాకీటాకీలా పనిచేసే ఈ డివైజ్ కెమెరా ఫంక్షనాలిటీ కలిగిఉన్నా ఇది స్మార్ట్‌ఫోన్ కాదు. తమ ప్రోడక్ట్ రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ను రీప్లేస్ చేసినా ప్రస్తుతానికి అలాంటిది ఉండదని రాబిట్ సీఈవో వెర్జ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. రాబిట్ ఆర్1 మొబైల్ యాప్స్‌ను పోలిన్ టాస్క్‌లను నిర్వహిస్తుంది. రాబిట్ ఓఎస్‌పై రన్ అయ్యే ఈ డివైజ్ సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ మాదిరి సొంత వర్చువల్ అసిస్టెంట్ ఫీచర్లను కలిగిఉంది.
రాబిట్ ఓఎస్ మ్యూజిక్‌ను కంట్రోల్ చేయడంతో పాటు యూజర్ల కోసం గ్రాసరీస్‌ను కొనుగోలు చేస్తుంది. మెసేజ్‌ను టెక్ట్స్ చేయడం, కాల్ చేయడం వంటివి నిర్వర్తిస్తుంది. మీరు కేవలం రిక్వెస్ట్‌ను వెల్లడించగానే మిగిలినదంతా డివైజ్ చూసుకుంటుంది. దీనికోసం పలు యాప్స్, లాగిన్స్ చేయాల్సిన అవసరం ఉండదు. మోడల్ అవుట్‌పుట్‌ను వ్యక్తిగతంగా యూజర్లు వ్యాలిడేట్ చేసేందుకే స్క్రీన్ ఉంటుందని రాబిట్ సీఈవో డెమో వీడియోలో వివరించారు. ఈ డివైజ్‌లో సిమ్ స్లాట్ ఉంటుంది. ఇందులో ఉండే రొటేటింగ్ కెమెరాతో ఫొటోలు తీయడంతో పాటు వీడియోలను రికార్డు చేయవచ్చు. స్క్రోల్ బటప్ పుష్ చేసి యూజర్లు డివైజ్‌తో మాట్లాడే వెసులుబాటు ఉంది.
Read More :
Noise Thrill | నాయిస్ కలర్‌ఫిట్ థ్రిల్ స్మార్ట్‌వాచ్ లాంఛ్ : ప్రత్యేకతలివే..!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

