న్యూఢిల్లీ : గూగుల్, మైక్రోసాఫ్ట్ బాటలో అలీబాబా గ్రూప్ చాట్‌జీపీటీ (ChatGPT ) తరహా ఏఐ టూల్‌ను ఆవిష్కరించింది. తాంగి క్విన్వెన్ పేరుతో ఏఐ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను ప్రారంభించింది. రాబోయే రోజుల్లో కంపెనీ బిజినెస్ అప్లికేషన్స్ అన్నింటినీ ఇందులో చొప్పించేందుకు కంపెనీ కసరత్తు సాగిస్తోంది. తొలుత డింగ్టాక్ను ఇంటిగ్రేట్ చేయనుంది.
ఇక ఏఐ టూల్ తాంగి క్విన్వెన్ను మీటింగ్ నోట్స్ సమ్మరీ, ఈమెయిల్స్ రాయడం, బిజినెస్ ప్రపోజల్స్ సిద్ధం చేయడం వంటి టాస్క్‌ల కోసం ఉపయోగిస్తారు. అలీబాబా వాయిస్ అసిస్టెంట్ టీమాల్ జీనికి కూడా ఏఐ టూల్‌ను అనుసంధానిస్తారు.
జనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా అన్ని వ్యాపార సెగ్మెంట్లలో సమూల మార్పులు తీసుకువస్తామని అలీబాబా సీఈవో డేనియల్ ఝాంగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ క్లైంట్లు కస్టమైజ్డ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ను నిర్మించే క్రమంలో తాంగి క్విన్వెన్ను వారికి ఓపెన్ చేసేందుకు అలీబాబా క్లౌడ్ సన్నాహాలు చేపట్టింది. ఓపెన్ఏఐ గత ఏడాది చాట్‌బాట్ సెన్సేషన్ చాట్‌జీపీటీని లాంఛ్ చేసిన అనంతరం టెక్ ప్రపంచంలో జనరేటివ్ ఏఐ టూల్స్‌పై హాట్ డిబేట్ సాగుతోంది.
Read More
AI pics | ప్రపంచ కుబేరులు బికారులైతే ఇలాగే ఉంటారు..!
Samsung | చాట్‌జీపీటీ తరహా ఏఐ సర్వీస్ ప్రారంభించేందుకు శాంసంగ్ సన్నాహాలు