ఒక్కసారి శానిటైజ్.. 35రోజులు రక్షణ

- 120 సెకండ్లలో 99.99% క్రిములు అంతం
- ఐఐటీ హైదరాబాద్, కియా బయోసంస్థ ఆవిష్కరణ
- పూర్తిగా జీవసంబంధ మిశ్రమాలతో తయారీ
- డ్యూరోకియా పేరుతో ఉత్పత్తి, మార్కెట్లోకి విడుదల
- ఆన్లైన్ విక్రయాలను ప్రారంభించిన పొఖ్రియాల్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ)/కంది: కరోనా సెకండ్‌వేవ్ విజృంభిస్తున్నవేళ స్టార్టప్ కంపెనీ కియా బయోటెక్‌తో కలిసి ఐఐటీ హైదరాబాద్ అత్యంత శక్తిమంతమైన హైజెనిక్ శానిటైజర్‌ను ఆవిష్కరించింది. ఒకసారి శానిటైజ్ చేస్తే ఏకంగా 35 రోజులపాటు వైరస్ నుంచి రక్షణ ఇచ్చే ఈ శానిటైజర్‌ను కేంద్ర విద్యాశాఖమంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మార్కెట్లోకి విడుదలచేశారు. డ్యురోకియా పేరిట ఈ శానిటైజర్ అందుబాటులోకి వచ్చింది. నూతన ఆవిష్కరణల్లో ఐఐటీ హైదరాబాద్ విశేషకృషి చేస్తున్నదని మంత్రి కొనియాడారు. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో డ్యురోకియా హైజెనిక్ ఉత్పత్తులు కీలక ముందడుగని అన్నారు. ఐఐటీ హైదరాబాద్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డీన్ ఎం శ్రీనివాస్, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్‌మూర్తి, పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జ్యోత్న్సేందుగిరి, ఇతర పరిశోధకులను మంత్రి అభినందించారు. డ్యురోకియా హైజినిక్ శానిటైజ్ ఉత్పత్తులు వినియోగదారులకు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
క్షణాల్లో వైరస్ అంతం
ఈ హైజెనిక్ శానిటైజర్ ఇంటి ఫ్లోర్, ఫర్నిచర్‌పై చల్లటానికే కాకుండా చేతులను శుభ్రం చేసుకోవటానికీ ఉపయోగించవచ్చు. వైరస్ బారి నుంచి దీర్ఘకాలం రక్షణ కల్పించేందుకు వేర్వేరుగా మిథనాల్, ఇథనాల్, అల్కహాల్‌తో కూడిన, ఆల్కహాల్ రహిత జీవసంబంధ మిశ్రమాలతో దీన్ని తయారుచేశారు. డ్యరోకియా-హెచ్, ఎస్, ఎం, ఆక్వా పేర్లతో వేర్వేరుగా ఇవి లభ్యమవుతాయి. డ్యూరోకియా-హెచ్ రెండురకాల హ్యాండ్శానిటైజర్. ఇది వైద్యసిబ్బందిని దృష్టిలో పెట్టుకుని తయారుచేసిన ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్. ఇది 120 సెకండ్లలోనే సూక్ష్మక్రిములను 99.99 శాతం అంతం చేయడంతోపాటు కొవిడ్-19 నుంచి కాపాడుతుంది. దీనికి అంతర్జాతీయ సంస్థల ఆమోదం కూడా లభించింది. డ్యూరోకియా-హెచ్ అక్వా చిన్నారులకు కూడా ఎలాంటి హానిచేయని హ్యాండ్శానిటైజర్. ఇందులో అల్కహాల్ ఉండదు. కేవలం ఇథనాల్ మిశ్రమంతోనే తయారుశారు. ఇది చర్మానికి హానిచేయదు. ఇంటి ఉపరితలాన్ని శుభ్రం చేసేందుకు డ్యూరోకియా-ఎస్ పేరుతో శానిటైజర్‌ను ఆవిష్కరించారు. దీనితో ఇంటిని శుభ్రం చేస్తే ఉపరితలంపై రక్షణపొర ఏర్పడుతుంది. అది 35 రోజులవరకు వైరస్‌లను దరిచేరనీయదు. వైరస్లు ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించే ఫేస్‌మాస్క్‌ల కోసం డ్యురోకియా-ఎం శానిటైజర్‌ను తయారుచేశారు. ఈ శానిటైజర్‌తో మాస్క్‌లు శుభ్రం చేసుకోవడం ద్వారా మరింత రక్షణ పొందవచ్చు. యాంటివైరస్ కోటింగ్ స్ప్రే వాడటంవల్ల పదేపదే మాస్కులను కొనుగోలు చేయాల్సిన అవసరముండదు. ఒకసారి వాడి పడేసే సర్జికల్ మాస్క్‌లతోపాటు ఎన్ 95, కాటన్ మాస్కులను సైతం దీనితో శుభ్రం చేసుకోవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

