BRS | రాజేంద్రనగర్ యూత్ కాంగ్రెస్‌కు షాక్… బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాష్
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.
మణికొండ,అక్టోబర్ 14 : రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. నార్సింగి డివిజన్‌కు చెందిన రాజేంద్రనగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దుడ్డు ఆకాష్ కాంగ్రెస్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో బుధవారం చేరారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, నియోజకవర్గ ఇంచార్జీ కార్తీక్రెడ్డిల ఆధ్వర్యంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ చేరిన దుడ్డు ఆకాష్‌కు పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పాటుపడే సబితారెడ్డి నేతృత్వంలో పనిచేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీని వీడటం జరిగిందన్నారు.
కాంగ్రెస్ పార్టీలో యువకులకు సరైన గుర్తింపు లేకపోవడం, దశాబ్దాలుగా పార్టీ అభ్యున్నతి కోసం శ్రమించిన నాయకులకు అధిష్ఠానం గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో రాజకీయంగా తమకు సబితారెడ్డి కుటుంబం వెన్నుదన్నుగా ఉండి ముందుకు నడిపించారని గుర్తుచేశారు. ఆ కుటుంబం నుంచి మరోసారి రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా యువనేత, బడుగుల ఆశాజ్యోతి కార్తీక్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడతామని ఆకాష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు సంతోష్ నాయుడు, రాజేష్‌లతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

