3న మహిళా సంక్షేమ శాఖ పోస్టుల రాత పరీక్ష
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీ కోసం ఈ నెల 3న నిర్వహిస్తున్న రాత పరీక్ష సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్వో సూర్యలత తెలిపారు
- జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీ కోసం ఈ నెల 3న నిర్వహిస్తున్న రాత పరీక్ష సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్వో సూర్యలత తెలిపారు. సోమవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో డీఆర్వో పరీక్షల నిర్వహణ పై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. జిల్లాల్లో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ పరీక్ష కేంద్రాల ద్వారా మొత్తం 230 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రాల్లో ఎలక్ట్రిసిటీ, మరుగుదొడ్లు, తాగునీరు ఉండే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అంతరాయం కలుగకుండా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లను నియమించినట్లు పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నేడు జరగనున్న టీఎస్పీఎస్సీ పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ విధిస్తూ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

