కాలె యాదయ్య గెలుపుతో సంబురాలు
బీఆర్ఎస్ చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య గెలుపు ఎంతో ఉత్కంఠ భరితంగా మారింది. మొయినాబాద్, షాబాద్, చేవెళ్ల మం డలాల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి భీం భరత్ ఆధిక్యంలో కొనసాగగా
మొయినాబాద్, డిసెంబర్ 3 : బీఆర్ఎస్ చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య గెలుపు ఎంతో ఉత్కంఠ భరితంగా మారింది. మొయినాబాద్, షాబాద్, చేవెళ్ల మం డలాల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి భీం భరత్ ఆధిక్యంలో కొనసాగగా.. నవాబుపేట, శం కర్పల్లి మండలాలకు సంబంధించి కాలె యాద య్య ఆధిక్యంలో కొనసాగారు. చివరకు చేవెళ్లలోని కొన్ని బూతుల్లో సంబంధించి యాదయ్య కు మెజార్టీ రాగా.. 268 ఓట్ల ఆధిక్యంతో విజ యం సాధించారు.
దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలకు సిద్ధమయ్యారు. అంతలోనే స్వల్ప మెజార్టీతో ఓటమిపాలైన భీం భరత్ మళ్లీ రీకౌంటింగ్ చేయాలని అధికారులను డిమాండ్ చేశా రు. అనుమానం ఉన్న బూతుల్లో రీకౌంటింగ్ చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. అనంతరం గ్రామంలో రాత్రి 8 గంటలకు బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన కాలె యాద య్య కౌంటింగ్ కేంద్రం నుంచి ఆర్మీ మై సమ్మ అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి మొయినాబాద్‌కు చేరుకున్నారు.
అజీజ్‌నగర్ గ్రామంలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పక్కన అం బేద్కర్ విగ్రహానికి, హిమాయత్‌నగర్ గ్రా మంలోని అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రా మ్ విగ్రహాలకు, మొయినాబాద్‌లోని మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. మొయినాబాద్‌కు చేరుకోగానే బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. జై యాదన్న, చేవెళ్ల గడ్డ యాదన్న అడ్డ అని నినాదాలు చేశారు.
శంకర్పల్లి : చేవెళ్ల ఎమ్మెల్యేగా కాలె యాదయ్య గెలుపొందడంతో మున్సిపాలిటీ, మండలంలో బీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, చైర్పర్సన్ విజయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షుడు పాండురంగారెడ్డి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ రాజూనాయక్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, సర్పంచ్ రవీందర్‌గౌడ్, నాయకులు సత్యనారాయణ, రవినాయక్, వెంకటేశ్ ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

