Yacharam | తిరుమలనాథ స్వామి ఆలయం వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు
అతి పురాతనమైన తిరుమలనాథ స్వామి ఆలయం వద్ద దేవాదాయ, ధర్మాదాయశాఖ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసింది.
యాచారం, నవంబర్30 : రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని అతి పురాతనమైన తిరుమలనాథ స్వామి ఆలయం వద్ద దేవాదాయ, ధర్మాదాయశాఖ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసింది. యాచారంలోని అత్యంత ఎత్తైన (తిరుమలేశునిగుట్ట) గుట్టపైన శ్రీవెంకటేశ్వరస్వామి భక్తుల కొంగుబంగారంగా కొలువుదీరాడు. టీటీడీ పర్యవేక్షణలో ఉన్న ఈ ఆలయానికి సర్వే నంబర్ 42లో 10ఎకరాల 26గుంటల భూమి ఉన్నది. ఈ భూమిని గత కొన్నాళ్లు కొంత మంది అక్రమార్కులు కబ్జా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. కొంత మంది ఇష్టారాజ్యంగా ఆలయ భూమిలోకి ప్రవేశిస్తున్నారు.
దీంతో రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి ఆలయ భూమి కబ్జాపై ఆర్డీఓ అనంతరెడ్డితో, దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులతో చర్చించారు. ఆలయ భూమిని అక్రమార్కుల నుంచి కాపాడాలని సూచించడంతో స్పందించిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు ఆలయ భూమిలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసింది. ఎవరైనా తిరుమలనాథ ఆలయానికి సంబంధించిన భూమిని కబ్జాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

