Vikarabad : రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి.. కలెక్టర్ నిఖిల

వికారాబాద్ : వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి సంబందించిన పలు విషయాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వాక్సినేషన్, ఐసోలేషన్, పర్యవేక్షణ(అబ్జర్వేషన్) గదులతో పాటు నిర్మాణంలో ఉన్న ఇతర ఆసుపత్రి గదులను జిల్లా అదనపు కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ రోగుల అవసరాల మేరకు అందుబాటులో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.
ప్రస్తుత వర్షాకాలం సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఎలాంటి అపరిశుభ్రత నెలకొనకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. ఆసుపత్రి వైద్యు సిబ్బంది క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ యాదయ్య, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
AP News | నిత్యావసరాల ధరలు పెంచి విజన్ కబుర్లు ఎందుకు.. కూటమి సర్కారుపై వైసీపీ ఫైర్..!
Nigerian tourist | ఎన్టీఆర్ బీచ్‌లో నైజీరియా పర్యాటకుడు మృతి..మరో ఐదుగురు సురక్షితం
Nitin Gadkari | అవన్నీ తప్పుడు కథనాలు, నేను పనిచేస్తూనే ఉంటా.. రిటైర్మెంట్ వార్తలపై నితిన్ గడ్కరీ..!
Suriya | హోంబలే ఫిలిమ్స్ నయా ప్రాజెక్ట్.. సూర్య రోల్ ఏంటో తెలిసిపోయింది.. !
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

