బ్యాగులు పట్టి, బడి బాట పట్టి.. ఎట్టకేలకు పాఠశాలలకు విద్యార్థులు
పలు పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో

వికారాబాద్ : కరోనా ప్రభావంతో చాలా రోజులుగా విద్యా సంస్థలు మూసి ఉన్నాయి. కరోనా తీవ్రత తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1, బుధవారం నుంచి విద్యా సంస్థలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో వికారాబాద్‌లోని పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల తెరుచుకోవడంతో విద్యార్థులు హాజరయ్యారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే పాఠశాలల పరిశుభ్రతతో పాటు శానిటైజేషన్ పనులు పూర్తి చేశారు. వికారాబాద్‌లోని గంగారం ప్రాథమిక పాఠశాలతో పాటు, మరికొన్ని పాఠశాలలకు కొత్త రంగులు వేసి అందంగా ముస్తాబు చేశారు. పాఠశాలలకు విద్యార్థులు సకాలంలో హాజరై ప్రార్థనలు చేశారు.
జడ్పీహెచ్ఎస్ బాల, బాలికల పాఠశాలతో పాటు మండల పరిధిలోని మైలార్‌దేవర్‌పల్లి పాఠశాలలను జిల్లా విద్యాధికారి రేణుకాదేవి సందర్శించారు. విద్యార్థులకు తరగతులు ప్రారంభించడంతో పాటు మధ్యాహ్న భోజనం, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వికారాబాద్ మండల విద్యాధికారి కార్యాలయంలో ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, శానిటైజర్లను ఎంఈవో బాబుసింగ్ పంపిణీ చేశారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

