తరగతి గదులను శుభ్రం చేయాలి
- ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్ల పరిశీలన
- జిల్లా కలెక్టర్ పౌసుమిబసు

వికారాబాద్ : పాఠశాలలోని అన్ని తరగతి గదులను తప్పనిసరిగా శుభ్రం చేయాలని వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల లు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. పట్టణంలోని 31, 32 వార్డుల్లో వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించారు. శానిటేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున విద్యార్థుల కు ఎలాంటి అసౌకర్యం కలుగకుండ ఉండేందుకు పారిశుధ్య పనులను చేపట్టాలన్నారు.
ప్రతి తరగతి గదిలో విద్యుత్, నీటి సదుపాయం ఉండేలా చూసుకోవాలని సూచించారు. నీటి సదుపాయం కోసం మిషన్ భగీరథ అధికారులను సంప్రదించాలన్నారు. ఏ ఒక్క విద్యార్థికి కూడా ఇబ్బంది కలుగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ఇంటి పైకప్పుపై నీరు నిలువ కుం డా చూసుకోవాలన్నారు. విరిగిన ప్లాస్టిక్ డబ్బాలు, ట్యూబ్‌లు నీటితొట్టెలలో నీరు నిలువకుండ ఎప్పటి కప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొని డెంగీ బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని ప్రజలకు సూచించారు. పార్కుల వద్ద అపరిశుభ్రంగా ఉండడంతో మున్సిపల్ అధికారులను వెంటనే పారిశుధ్యం పనులు చేపట్టాలని ఆదేశించారు.

32వ వార్డులో గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద అపరిశుభ్రంగా ఉండడంతో వెంటనే శుభ్రం చేయిం చాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా ప్రతి రోజు మున్సిపల్ పరిధిలో పారిశుధ్య పనులు చేపట్టి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ శరత్‌చంద్రను ఆదే శించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, డీఈవో రేణుకాదేవి, డీడబ్ల్యూవో లలితకుమారి, విద్యుత్ శాఖ ఇంజినీర్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

