పెద్దేముల్ : మండల పరిధిలోని గొట్లపల్లి మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయుల ఖాళీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గొట్లపల్లి మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాఘవేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గొట్లపల్లి మోడల్ స్కూల్లో ప్రధానంగా పీజీటీ -ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, ఇంగ్లీషు, టీజిటీ-హిందీ సబ్జెక్టులను బోధించడానికి ఉపాధ్యాయులు కావాలన్నారు. అభ్యర్థులు పీజీటీ ఖాళీలకు గాను సంబంధిత సబ్జెక్టులో పీజీ కనీసం 50% శాతం మార్కులతో పాటు బీఈడీ కలిగి ఉండాలని, టీజీటీకి గాను సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ కనీసం 50% మార్కులతో పాటు బీఎడ్/పండిత్ ట్రైనింగ్, టెట్లో అర్హత సాధించి ఉండాలని తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 6వ తేదిలోపు దరఖాస్తుతో పాటు సర్టిఫికేట్ జిరాక్స్లను పాఠశాలలో ఇవ్వాలని కోరారు.