రేషన్ లబ్ధిదారులకు ఈకేవైసీ
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పేద ప్రజలకు ప్రతినెలా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నది. ఆహార భద్రతా కార్డులు కలిగి ఉన్న కుటుంబాల్లో ఎంత మంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నది.
- తప్పనిసరి చేసిన ప్రభుత్వం
- రేషన్ దుకాణాల్లో వేలిముద్రలు తీసుకుంటున్న డీలర్లు
- అర్హులకు బియ్యం అందించడానికి ప్రభుత్వం ప్రణాళిక
- వికారాబాద్ జిల్లాలో 588 రేషన్ దుకాణాలు
- 2.50 లక్షల ఆహార భద్రతా కార్డులు
- l 8.40 లక్షల మంది లబ్ధిదారులు
బొంరాస్‌పేట, సెప్టెంబర్ 24 : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పేద ప్రజలకు ప్రతినెలా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నది. ఆహార భద్రతా కార్డులు కలిగి ఉన్న కుటుంబాల్లో ఎంత మంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోయినా, ఆడపడుచులు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లినా లబ్ధిదారులు మాత్రం బియ్యం తీసుకెళ్తున్నారు. దీనిని అరికట్టి అర్హులైన పేదలకు బియ్యం అందించడానికి ప్రభుత్వం లబ్ధిదారులతో ఈకేవైసీ చేయించాలని నిర్ణయించింది. జిల్లాలో 588 రేషన్ దుకాణాలు ఉండగా.. వీటి పరిధిలో 2.50 లక్షల ఆహార భద్రతా కార్డులు, 8.40 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రేషన్ డీలర్లు ఈకేవైసీ ప్రక్రియను ప్రారంభించారు. దీంతో లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకోవడానికి రేషన్ దుకాణాలకు క్యూ కడుతున్నారు. శనివారం నాటికి 90 వేల మంది లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకున్నారని, 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 2.50 లక్షల కార్డులు
వికారాబాద్ జిల్లాలో 588 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆహార భద్రతా కార్డులు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిపి 2.50 లక్షల కార్డులు ఉండగా వీటిలో 8.40 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం ప్రతినెలా ఆరు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నది. ఈ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఈకైవేసీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. డీలర్లు ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించారు. లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు వచ్చి ఈపాస్ యంత్రంలో వేలిముద్రలు వేసి ఈకేవైసీ చేసుకుంటున్నారు. శనివారం నాటికి జిల్లాలో 90 వేల మంది ఈకేవైసీ చేయించుకున్నారని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.
ఈకేవైసీ ఇలా..
రేషన్ కార్డు కలిగిన కుటుంబ యజమానితో పాటు కార్డుల్లో పేరున్న సభ్యులందరూ ఈకేవైసీ నమోదు కోసం తప్పనిసరిగా రేషన్ దుకాణానికి వెళ్లాలి. అక్కడ ఈ పాస్ యంత్రంలో వేలిముద్రలు వేసి ఈకేవైసీ సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఈపాస్ యంత్రంలో వేలిముద్ర వేయగానే రేషన్‌కార్డు నంబర్ ఎంటర్ చేస్తే కార్డులోని సభ్యుల పేర్లు వస్తాయి. ఈకేవైసీ చేయకుంటే పేర్లు ఎర్ర రంగులో కనిపిస్తాయి. ఈపాస్ యంత్రంలో వచ్చిన పేరుమీద క్లిక్ చేసి వేలిముద్ర వేస్తే ఆకుపచ్చ వెలుగు వస్తుంది. దీంతో సదరు వ్యక్తి ఈకైవేసీ విజయవంతంగా పూర్తయినట్టు. ఇలా కార్డులోని ప్రతి వ్యక్తీ ఈకేవైసీ చేయించుకోవాలి. వేలి ముద్రలు రాకుంటే ఐరిస్ విధానంలో కూడా ఈకేవైసీ చేయించుకోవచ్చు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

