ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా

శంకర్పల్లి : రాబోయే తరాల వారి భవిష్యత్ కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ శ్రీనివాస్‌గుప్తా అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలం ప్రొద్దటూరు గ్రామ శివారులో గల ప్రగతి రిసార్ట్స్‌లో వంద సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఆషాఢ అమవాస్య పుష్యమి నక్షత్రం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని రిసార్ట్ సీఎండీ డాక్టర్ జీబీకేరావు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చైర్మన్ హాజరై రిసార్ట్స్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి అతి దగ్గరలో ఇలాంటి రిసార్ట్ ఉండడం నగరవాసుల అదృష్టం అన్నారు. రిసార్ట్ లో వేల చెట్లతో పాటు ఔషధ మొక్కలను కూడా రిసార్ట్ ఎండీ జీబీకే రావు మొక్కలను నాటడం హర్షనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ప్రతీ గ్రామం పచ్చగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గ్రామాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయించి హరిత గ్రామాల్లా సీఎం మార్చుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రగతి రిసార్ట్ చీఫ్ పీఆర్ఓ డాక్టర్ ఎస్. రవిందర్, జీఎం రామకృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

