World Biryani day | వాహ్వా బిర్యానీ.. రోజురోజుకూ పెరుగుతున్న క్రేజ్.. అందుకు తగ్గట్టు మార్కెట్లోకి కొత్త రుచులు
అది పెండ్లయినా, రిసెప్షన్ అయినా, ఎంగేజ్మెంట్ అయినా, బర్త్‌డే పార్టీ అయినా, మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ జరిగినా, గెట్ టు గెదర్ మీటింగ్ జరిగినా.. చివరకు దశదినకర్మల్లోనూ.. ఇలా సందర్భం ఏదైనా బిర్యానీ తప్పనిసరయింది.
- దావత్ ఏదైనా బిర్యానీ తప్పనిసరి
- నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం
World Biryani day | అది పెండ్లయినా, రిసెప్షన్ అయినా, ఎంగేజ్మెంట్ అయినా, బర్త్‌డే పార్టీ అయినా, మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ జరిగినా, గెట్ టు గెదర్ మీటింగ్ జరిగినా.. చివరకు దశదినకర్మల్లోనూ.. ఇలా సందర్భం ఏదైనా బిర్యానీ తప్పనిసరయింది. బిర్యానీ లేకుండా కార్యక్రమం జరగడం చాలా అరుదు. రెండు దశాబ్దాల కిందట కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్లు, పేరుగాంచిన హోటళ్లకే పరిమితమైన పదం ఇది. కానీ, ఇప్పుడు ఏ చిన్న హోటల్‌ను చూసినా, ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా కనిపించే మొదటి ఫుడ్ ఇదే. వినిపించే మొదటి పదం కూడా ఇదే. బిర్యానీకి అంత క్రేజీ పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రముఖ డెలివరీ సంస్థలు ప్రత్యేక రోజుల్లో అంటే డిసెంబర్ 31, జనవరి 1, ఫ్రెండ్షిప్ డే లాంటి సందర్భాల్లో రోజుకు లక్షల ఆర్డర్లు అందుకుంటున్నాయి. ఈ అంకెలే చెప్తున్నాయి మన దగ్గర బిర్యానీకి ఉన్న క్రేజీ ఏమిటో.
– పెద్దఅంబర్‌పేట, జూలై 1
ఎన్నో రుచులు..
జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటారు పెద్దలు. నిజంగా ఈ సామెత వాస్తవరూపం దాల్చేలా రెస్టారెంట్లు భోజన ప్రియుల అభిరుచికి తగ్గట్టు బిర్యానీలు సిద్ధం చేస్తున్నాయి. కొందరు పులుపును ఇష్టపడితే, చాలామంది స్పైసీ అంటే ఆసక్తి చూపుతున్నారు. కొందరు గ్రేవీగా ఉండాలని కోరుకుంటే, ఇంకొందరు లేయర్లుగా ఉన్న బిర్యానీ తినేందుకు ఇష్టపడతారు. మరోవైపు, నగరంలోని బ్రాండెడ్ రెస్టారెంట్లు, హోటళ్లలో అత్యధికంగా దాదాపు రూ.500 లకు బిర్యానీ వస్తుండగా.. చిన్న చిన్న హోటళ్లలో సింగిల్ బిర్యానీ రూ.100కే ఇచ్చేస్తున్నారు. పేరుకు తగ్గట్టు రుచులు ఉంటాయని భోజన ప్రియులు చెప్తున్నారు.
మామా.. మ్యారేజ్ డే పార్టీ ఇవ్వాలి..
ఆదివారం బిర్యానీ తినిపించాల్సిందే..
ఓ ఫ్రెండ్‌తో మరో ఫ్రెండ్ మాట ఇది..
బావా.. కోడలు బర్త్‌డే పార్టీలో
ఏ బిర్యానీ పెడితే బాగుంటుంది..
ఓ బావ మరిది ప్రశ్న ఇది..
గృహ ప్రవేశానికి
ఏ బిర్యానీ పెట్టాలా అని ఆలోచిస్తున్నా..
పిల్లలతో ఓ కొత్తింటి యజమాని చర్చ ఇది.
హండీ నుంచి.. మండీ దాకా..
హైదరాబాద్‌తోపాటు శివారులోని రెస్టారెంట్లు, హోటళ్లలో పలు రకాల బిర్యానీలు భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. పేరు వింటేనే నోరూరేలా చేస్తున్నాయి. ఒక్కొక్కరు తినే బిర్యానీలు కొన్ని ఉండగా.. స్నేహితులు లేదా కుటుంబసభ్యులు నలుగురు కలిసి తినే మండీ బిర్యానీలకు ఇటీవల క్రేజ్ పెరిగింది. ఒకే పెద్ద సైజు ప్లేటులో నాలుగు పెద్ద ముక్కలతో పాటు బిర్యానీ రైస్ ఇస్తున్నారు. అరేబియన్ మండీకి మంచి డిమాండ్ ఉన్నది. హండీ బిర్యానీ, మండీ బిర్యానీ, ధమ్కీ బిర్యానీ, జాఫ్రానీ, రెడ్ బకెట్, నిజాం బిర్యానీ, తహారీ బిర్యానీ, కశ్మీరీ బిర్యానీ, నల్లీగోష్ బిర్యానీ, కీమా బిర్యానీ, చికెన్ బిర్యానీ మాంసాహారులను ఆకట్టుకుంటుండగా.. వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, మష్రూం బిర్యానీ, ఆవకాయ బిర్యానీ.. మరెన్నో శాకాహారులను కట్టిపడేస్తున్నాయి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

