Ashada Bonalu | నేడు గోల్కొండ కోటలో ఆషాఢ బోనాలు ప్రారంభం.. తొలి పూజకు హాజరుకానున్న మంత్రులు
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు గురువారం ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం సమర్పణతో రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమవుతాయి.
- ప్రారంభించనున్న మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ
- ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పణ
Ashada Bonalu | మెహిదీపట్నం, జూన్ 21 : తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు గురువారం ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం సమర్పణతో రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ 9 వారాలపాటు జరిగే బోనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గోల్కొండ కోట బోనాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతిని తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఇక్కడ జరిగే బోనాలకు రెండు తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని బోనాలను సమర్పిస్తారు.
ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలు సమర్పణ..
గురువారం రోజు గోల్కొండ బోనాలు లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి ప్రారంభం అవుతాయి. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి పూజకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు బోర్డు వారికి పట్టువస్ర్తాలను లంగర్‌హౌస్ చౌరస్తాలో అందజేయనున్నారు. లంగర్‌హౌస్ నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ బడాబజార్, ఛోటాబజార్ల మీదుగా కోటపై ఉన్న అమ్మవారికి ఆభరణాలను అందించడం, బోనాల సమర్పణ, తొట్టెల సమర్పణతో తొలిపూజ ముగుస్తుంది. బడాబజార్‌లో ఆలయ పూజారి అనంతచారి ఇంటి నుంచి అమ్మవారి ఆభరణాలను ఊరేగింపుగా తీసుకెళ్తారు.
ట్రాఫిక్ ఆంక్షలు
సిటీబ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ): గోల్కొండ బోనాలు గురువారం నుంచి నగరంలో ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు గోల్కొండకు వచ్చే రూట్లలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందని నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. బోనాల పూజ కార్యక్రమాలు ఈనెల 22, 25, 29, జూలై 2, 6, 9, 13, 16, 20వ తేదీల్లో ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా రాందేవ్‌గూడ నుంచి మక్కీ దర్వాజ మీదుగా గోల్కొండ కోట, లంగర్‌హౌస్ నుంచి ఫతేదర్వాజా మీదుగా గోల్కొండ, సెవెన్ టూంబ్స్ నుంచి బంజారా దర్వాజా మీదుగా గోల్కొండ కోటకు వచ్చే రూట్లలో రాకపోకలు సాగించే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు.
బోనాలకు వచ్చే భక్తుల పార్కింగ్ స్థలాలు..
రాందేవ్‌గూడ వైపు నుంచి వచ్చే వాహనాలు ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు అషూర్ఖాన నుంచి మిలిటరీ సెంట్రీ పాయింట్ పార్కింగ్ స్థలాల్లో పార్కు చేయాలి.
లంగర్‌హౌస్ నుంచి వచ్చే ద్విచక్ర, త్రి చక్ర వాహనాలు హుడా పార్కులో, నాలుగు చక్రాల వాహనాలు ఓవైసీ గ్రౌండ్, పుట్ బాల్ గ్రౌండ్లలో పార్కు చేయాలి.
షేక్‌పేట్, సెవెన్ టూంబ్స్ నుంచి వచ్చే వాహనాలు ప్రియదర్శిని స్కూల్, ఏరియా హాస్పిటల్, బస్‌స్టాప్‌లలో పార్కు చేయాలి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Metro RTC Pass | రూ.8,500 పాస్ రూ.4 వేలకే.. మెట్రో-ఆర్టీసీ ధరలపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్
Sreemukhi | మత్తెక్కించే చూపులతో శ్రీముఖి..
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

