నిధులిస్తేనే మెట్రోకు కొత్త కోచ్‌లు
నిత్యం రద్దీగా ఉండే మెట్రోకు ప్రభుత్వం నిధులిస్తే గానీ కొత్త కోచ్‌లు వచ్చే పరిస్థితి లేదు. తాజాగా కొత్త కోచ్‌లను ఏర్పాటు చేయాలని ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో..బోగీలను తీసుకొచ్చేందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని ఎల్అండ్టీ సంస్థ ప్రభుత్వాన్ని కోరుతున్నది.
సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : నిత్యం రద్దీగా ఉండే మెట్రోకు ప్రభుత్వం నిధులిస్తే గానీ కొత్త కోచ్‌లు వచ్చే పరిస్థితి లేదు. తాజాగా కొత్త కోచ్‌లను ఏర్పాటు చేయాలని ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో..బోగీలను తీసుకొచ్చేందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని ఎల్అండ్టీ సంస్థ ప్రభుత్వాన్ని కోరుతున్నది. నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉండే మార్గాల్లో కొత్త కోచ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి న నేపథ్యంలో.. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వం సహకరిస్తేనే కొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం 1075 ట్రిప్పులు..
ప్రస్తుతం 1075 ట్రిప్పుల ద్వారా రవాణా సదుపాయాన్ని అందిస్తున్న మెట్రో..చాలీచాలనీ బోగీలతోనే గడిచిన ఐదారేండ్లుగా నెట్టుకొస్తున్నది. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో ప్రయాణికులతో కిక్కిరిపోతున్నా… అవే మూడు బోగీలతోనే లాక్కొస్తున్నది. కనీసం రద్దీ ఎక్కువగా ఉండే సమయంలోనైనా అదనపు బోగీలను ఏర్పాటు చేయకపోవడంతో మెట్రో ప్రయాణికులు తోపులాట మధ్యే రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం రద్దీగా నాగోల్ – రాయదుర్గం మార్గంలోనైతే… మూడు సర్వీసు లు వచ్చిన కూడా ప్లాట్‌ఫారాల మీద ఉండే రద్దీ మాత్రం తగ్గడం లేదు.
కొత్త కోచ్‌లకు టైం కావాలే…
ప్రస్తుతం ఉన్న కోచ్‌లతో నిత్యం 5 లక్షల మందిని మెట్రో సంస్థ గమ్యస్థానాలకు చేర్చుతున్నది. అయితే టైం ఫ్రీక్వెన్సీని సర్దుబాటు చేయగలిగితే… ప్రయాణికుల సంఖ్యను 7 లక్షలకు పెంచే వీలు ఉందని సమాచారం. అయితే 10లక్షల మంది ప్రయాణించేందుకు కచ్చితంగా మరో 10 కోచ్‌లు ఉంటే గానీ సాధ్యం కాదని తెలిసింది. కొత్త మార్గా ల్లో కొత్త ట్రైన్లతో పది లక్షల ప్రయాణికుల మార్క్ ను దాటే అవకాశం ఉందన్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న రైడర్ షిప్ కూడా పూర్తి సామర్థ్యానికి కంటే 10శాతమే తక్కువ ఉందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి.
కొత్త కోచ్‌ల డిజైన్లు ఖరా రు చేసేందుకు ఆరు నెలల పడుతుందని, మరో ఏడాదిన్నర తర్వాతనే కొత్త ట్రైన్లు అందుబాటులోకి వస్తాయని అప్పటివరకు పాత విధానంలోనే ప్రయాణికులకు సేవలు అందిస్తామని మెట్రో వర్గాలు చెబుతున్నాయి.
ప్రతిపాదనలు సిద్ధం..
మూడు బోగీలు ఉండే 10 కొత్త ట్రైన్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు, ఇప్పటికే సంబంధిత ఉత్పత్తి సంస్థలను గుర్తించి సంప్రదింపులు జరిపినట్లుగా తెలిసింది. ప్రస్తుతం 57 హ్యుందాయ్ రోటెమ్ త్రీ కోచ్‌లతో కూడిన రైళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో కొత్త డిజైన్ల ఎంపికపై దృష్టి పెట్టారు. అయితే ఇందుకు పుణె, నాగ్‌పూర్ మెట్రో సంస్థలను ఆశ్రయించారు. ఆయా సంస్థల వద్ద చాలినన్నీ అదనపు కోచ్‌లు లేవని తెలిసింది. ఈ క్రమంలోనే కొత్త డిజైన్లతో కూడిన ట్రైన్లను తీసుకువచ్చే ప్రతిపాదనలు ఉన్నా… ఎల్ అండ్ టీ వద్ద ఉన్న ఆర్థిక పరమైన అంశాలతో వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రభు త్వం సహకరిస్తే…. 10 ట్రైన్లను తీసుకొస్తామంటున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

