తలకొండపల్లిలో పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ

తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ ఆలయాలకు పూర్వవైభవం తెస్తుందని ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరేటి వెంకన్న అన్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలో రూ. 25 లక్షలతో గ్రామ సర్పంచ్ సొంతంగా నిర్మించిన పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా విచ్చేసి ఆలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీలను సర్పంచ్ లలితజ్యోతయ్య ఘనంగా సన్మానించారు.
అంతకు ముందు పోచమ్మ అమ్మవారిని గ్రామంలో ఊరేగింపు చేసి ఆలయంలో వేదమంత్రోచ్చరణతో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వారికి సమాజంలో తరగని ఆదరణ గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటేశ్, ఎంపీపీ నిర్మల, ఎంపీటీసీ హేమ, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు గోపాల్‌నాయక్, విఠల్, శేఖర్, శ్రీనివాస్, యాదగిరి, రాములు, పెంటయ్య, కృష్ణయ్య, యాదయ్య, రవి పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
Fake Police | పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలు.. రెండు సార్లు జైలుకు వెళ్లినా మారని తీరు
Rajeev Kanakala | భార్య సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

