ఉల్లాసంగా.. ఉత్సాహంగా
గచ్చిబౌలి బాలయోగి అథ్లెటిక్ క్రీడా స్టేడియంలో వేసవి శిక్షణ శిబిరం ఉత్సాహంగా కొనసాగుతున్నది. వేసవిలో చిన్నారులు ఎంతో ఉల్లాసంగా పలు క్రీడల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారు.
- గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యేకంగా వేసవి శిక్షణ శిబిరం తరగతులు
- 45 రోజుల పాటు కొనసాగనున్న ప్రత్యేక శిబిరం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28: గచ్చిబౌలి బాలయోగి అథ్లెటిక్ క్రీడా స్టేడియంలో వేసవి శిక్షణ శిబిరం ఉత్సాహంగా కొనసాగుతున్నది. వేసవిలో చిన్నారులు ఎంతో ఉల్లాసంగా పలు క్రీడల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్(సాట్స్) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ శిబిరంలో వివిధ క్రీడాంశాల్లో శిక్షణ పొందుతున్న చిన్నారులతో గచ్చిబౌలి స్టేడియం కళకళలాడుతున్నది. ప్రధానంగా అథ్లెటిక్స్ క్రీడాంశాలు, పుట్‌బాల్, స్విమ్మింగ్, రెజ్లింగ్. బ్యాడ్మింటన్ క్రీడల్లో చిన్నారులకు ఈ వేసవి శిబిరంలో ప్రత్యేకంగా శిక్షణను అందిస్తున్నారు.

45 రోజుల పాటు శిక్షణ..
ఈ నెల 15న ప్రారంభమై శిబిరంలో 45 రోజుల పాటు చిన్నారుల్లో క్రీడానైపుణ్యాన్ని పెంపొందించనున్నారు. ఇందులో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఈ వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. 10 నుంచి 18 సంవత్సరాలు లోపు చిన్నారులు ఈ వేసవి శిబిరంలో శిక్షణ పొంతున్నారు. మొత్తం 637 మంది చిన్నారులు ఉత్సాహంగా ఈ వేసవి శిబిరంలో పాల్గొంటున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారులకు సాట్స్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు సైతం అందజేయనున్నారు.
మే 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఆసక్తి కలిగిన చిన్నారులు మే 10 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు లేదా స్కూల్ ఐడీకార్డు, రెండు పాస్‌ఫోర్టు ఫొటోలతో గచ్చిబౌలి స్టేడియంలోని పరిపాలనా విభాగాన్ని సంప్రదించాలి. చిన్నారులు ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసకోవాలి.
– గోకుల్, స్టేడియం పరిపాలనాధికారి
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

