కంది సాగు ఆశాజనకం
వాన కాలంలో వేసిన పత్తి, సోయా, మొక్క జొన్న పంటలు చేతికొస్తున్నాయి. వీటితో పాటు సాగు చేసిన కంది సైతం కోత దశకు చేరుకున్నది. వాన కాలం ప్రారంభం నుంచి కుండపోత వర్షాలకు పంటలకు నష్టం వాటిల్లింది.
- 4,713 ఎకరాల్లో సాగు..
- ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.6,600
మోమిన్‌పేట, నవంబర్ 24: వాన కాలంలో వేసిన పత్తి, సోయా, మొక్క జొన్న పంటలు చేతికొస్తున్నాయి. వీటితో పాటు సాగు చేసిన కంది సైతం కోత దశకు చేరుకున్నది. వాన కాలం ప్రారంభం నుంచి కుండపోత వర్షాలకు పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో పత్తి పంట దిగుబడి తగ్గి రైతులు నష్టాలపాలయ్యారు. అయితే ఈ పంటలతో సమానంగా సాగు చేసిన కంది పంట అన్ని ఒడుదుడుకులను తట్టుకుని ఆశాజనకంగా కనిపిస్తున్నది. దీంతో రైతులు కందిపై ఆశలు పెట్టుకొని పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మండలంలో ఈ ఏడాది వానకాలంలో పత్తి పంట 19,132 ఎకరాల్లో సాగుచేయగా అంతర్ పంటగా కంది 4,713 ఎకరాల్లో సాగవుతున్నది. పంటను చీడపీడల నుంచి కాపాడుకోవడానికి రైతులు సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ మద్దతు ధర ఎక్కువగా ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. పత్తి, సోయా పంటలకన్నా కందికి ప్రభుత్వం ఎక్కువ మద్దతు ధర నిర్ణయించింది అయితే రైతులు పంటలను కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు అయ్యే ఖర్చులకు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ కంది పంట కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే పంటలను తరలించే భారం తగ్గి పూర్తి స్థాయిలో మద్దతు ధర పొందే అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మార్కెట్ కమిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
పురుగు నివారణకు ప్రత్యేక శ్రద్ధతీసుకోవాలి
కంది పంట సాగులో మొక్కలో మొగ్గ, పూత, పిందెల మీద శనగపచ్చ పురుగులు వాలి పంటలను నష్టం చేస్తాయి. వీటి నివారణకు 2.5 మిల్లీ లీటర్ల క్లోరిఫైరిఫాస్ లేదా రెండు మిల్లీలీటర్ల క్వినాల్ పాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్‌ను లీటర్ నీటిలో కలిపి పంటకు పిచికారీ చేస్తే పురుగుల నుంచి రైతులు పంటను రక్షించుకోవచ్చు. పురుగు తీవ్రత ఎక్కువ ఉంటే 0.4 గ్రాముల ఇమామెక్టివ్ బెంజోయేట్ లేదా మిల్లీ లీటర్ల ఇండాక్సాకార్స్ లేదా 0.3 మిల్లీ లీటర్ల స్పైనోసిడ్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడంతో పంటను నాశనం చేసే పురుగులు నియంత్రణలో ఉంటాయి. మందులు పిచికారీ సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి – జయశంకర భూపతి, ఏవో, మోమిన్‌పేట
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

