Rangareddy : పండుగలా బతుకమ్మ చీరల పంపిణీ
- రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా కార్యక్రమాలు
- శంకర్‌పల్లిలో చీరల పంపిణీలో పాల్గొన్న మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య

షాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో పండగ వాతావరణంలో ప్రారంభమైంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో లబ్ధిదారులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. శనివారం జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లిలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య చీరలు పంపిణీ చేయగా, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట్‌లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆమనగల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, షాద్‌నగర్, కొందుర్గు మండలాల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
ఆయా మండలాల్లో, మున్సిపాలిటీలలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు చీరల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగకు బతుకమ్మ చీరలు అందించడం సంతోషంగా ఉందని మహిళలు తెలిపారు. సర్కార్ అందిస్తున్న ఈ బతుకమ్మ చీరలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నట్లు మహిళలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

