చెత్త నిర్ణయం వెనక్కి తీసుకునేదాకా ఉద్యమం ఉధృతం
స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సిద్దాపూర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో షాద్‌నగర్ చౌరస్తాలో నిరసనలు తెలిపిన అనంతరం మాట్లాడారు.
- సిద్దాపూర్ డంపింగ్ యార్డుపై పోరాటానికి సిద్ధం
- యార్డు జీఓపై స్పందించని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ – ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి
- షాద్‌నగర్ పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు
షాద్‌నగర్, జూలై 7 : స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సిద్దాపూర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో షాద్‌నగర్ చౌరస్తాలో నిరసనలు తెలిపిన అనంతరం మాట్లాడారు. చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం జీఓ 641ని విడుదల చేయడం దురదృష్టకరమని, పచ్చని పల్లెలను కలుషితం చేసేందుకు సర్కారు చర్యలు తీసుకోవడం బాధాకరమని మండిపడ్డారు.
సిద్దాపూర్ గ్రామ ప్రజలతోపాటు పరిసర గ్రామాల ప్రజలు, గిరిజన తండాలవాసులు ప్రభుత్వం ఇచ్చిన జీఓపై ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌లో స్పందన లేదన్నారు. గ్రామంలో చెత్త డంప్ యార్డు నిర్మాణం జరగదని ప్రజలను నమ్మించిన ఎమ్మెల్యే.. నేడు నోరు మెదపడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేతోపాటు కాంగ్రెస్ నాయకులు రూ.50 కోట్ల ముడుపులను తీసుకొని చెత్త డంప్ యార్డు నిర్మాణానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పనితీరుపై అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారని, రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందన్నారు. సిద్దాపూర్ భూముల్లోకి అధికారులిస్తే తరిమికొట్టాలన్నారు.
స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని, నిరసన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ జీఓ 641ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. పచ్చని పల్లెలను కలుషితం చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదని, చెత్త డంపింగ్ యార్డుతో స్థానిక అభివృద్ధి కుంటుపడుతుందని, ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇందులోభాగంగా స్థానిక నేతలతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో చెత్త డంపింగ్ యార్డు వ్యతిరేక జేఏసీ అధ్యక్షుడు సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్, నాయకులు యుగేందర్, నారాయణరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రామకృష్ణ, సిద్దాపూర్ శ్రీనివాస్‌రెడ్డి, సిద్దాపూర్ తదితర గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

