డీజేల హోరు.. అశ్లీల నృత్యాల జోరు..
అర్ధరాత్రి సమయంలో డీజేల హోరు.. యువతులు అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తుండగా ఎస్వోటీ పోలీసులు దాడి చేసి ముజ్రా పార్టీని భగ్నం చేశారు.
- మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ
- భగ్నం చేసిన ఎస్వోటీ పోలీసులు
- అదుపులో ఆరుగురు యువకులు, నలుగురు యువతులు
మొయినాబాద్, జూలై 9 : అర్ధరాత్రి సమయంలో డీజేల హోరు.. యువతులు అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తుండగా ఎస్వోటీ పోలీసులు దాడి చేసి ముజ్రా పార్టీని భగ్నం చేశారు. ఆరుగురు యువకులు, నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నా రు. మండలంలోని సురంగల్ గ్రామ సమీపంలోని అజీబ్నగర్ రెవెన్యూలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతా నికి చెందిన రెహన్సిద్ధ్ద చౌహాన్ ఆటోడ్రైవర్. అతడి భార్య ఆర్కెస్ట్రా సింగర్‌గా పని చేస్తున్నది. కాగా, రోహన్ టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఐదుగురు యువకులతో కలిసి ముజ్రా పార్టీ నిర్వహించేందుకు సురంగల్ సమీపంలోని అజీబ్నగర్ రెవెన్యూలో ఉన్న ఆర్ఎస్ ఫామ్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నాడు.
ఆర్కెస్ట్రా డ్యాన్సర్లుగా పనిచేసే ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులు, హైదరాబాద్‌కు చెందిన మరో ఇద్దరు యువతులను తీసుకుని సోమవారం రాత్రి ఆ ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో డీజేల సౌండ్ అధికంగా పెట్టి అర్ధనగ్నంగా.. అసభ్యంగా నృత్యాలు చేస్తుండగా.. విశ్వసనీయ సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆ ఫామ్‌హౌస్‌పై దాడి చేసి..
నలుగురు యువతులు, ఆరుగురు యువకులను పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న రెండు కార్లు , మ్యూజిక్ సిస్టం, సెల్ఫోన్లు, రూ.12,160 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. పరీక్షల్లో డ్రగ్స్ తీసుకోలేదని తేలింది. కేసు నమోదు చేసిన వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SONNENTAL | ‘డార్క్’ మేకర్స్ నుంచి మరో క్రేజీ థ్రిల్లర్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘సోనెంటల్’ ట్రైలర్!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌కు FWICE గట్టి వార్నింగ్.. భారత్‌లో ఆ పాకిస్థానీ వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే షూటింగ్స్ బంద్!
Hyderabad | కొండాపూర్‌లో అక్రమ సెల్లార్ నిర్మాణం.. కూలిన పక్క హోటల్ గోడ, పలువురికి గాయాలు!
Road Accident | ఇచ్చోడ జాతీయ రహదారిపై కారు బోల్తా.. నలుగురికి గాయాలు
గద్వాల ఆర్టీవో కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ల ఆందోళన.. DTOతో మాట్లాడిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

