ఆయువును పెంచుతాయి
గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అలాంటి గృహాలు నేడు నగరంలో కాలుష్య నిలయాలుగా మారిపోయాయి. అందుకే ఇంటిని ఆనందమయం చేసుకునేందుకు మొక్కలు పెంచాలంటున్నారు.
- ఇంటిల్లిపాదికి రక్షణ కవచంలా మొక్కలు
- ఇంట్లోని కాలుష్యాన్ని తరిమేసే రక్షకులు
- అలంకరణలోనూ ఆకట్టుకునే ప్లాంట్స్
- స్పైడర్ ప్లాంట్, అలోవేరా, జడ్జడ్లతో ఆక్సిజన్
గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అలాంటి గృహాలు నేడు నగరంలో కాలుష్య నిలయాలుగా మారిపోయాయి. అందుకే ఇంటిని ఆనందమయం చేసుకునేందుకు మొక్కలు పెంచాలంటున్నారు. మొక్కలు.. ఆరోగ్యాన్ని అందించే ఆయుధాలు. కాలుష్యాన్ని తరిమేసే రక్షకులు. ఇంటికి అలంకరణే కాదు అందులోని విషవాయువులను బయటకు పంపించి.. స్వచ్ఛమైన గాలిని ప్రసరింపజేసే అద్భుత శక్తులు. నగరంలోని వాహనాల రద్దీతో ఇండ్లన్నీ దుమ్ము, ధూళితో కాలుష్యమయమవుతున్నాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోని కాలుష్యాన్ని తరిమేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మొక్కలు పెంచుకుంటే ఆ కాలుష్యం నుంచి విముక్తి పొందొచ్చని సూచిస్తున్నారు. అలాంటి మొక్కలు పెంచుకొని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ ఆనందాన్ని రెట్టింపు చేసుకుందాం.
-సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ)
ఈ మొక్కలు మీ రక్షకులు..
అలోవేరా(కలబంద), డ్రాగన్, జడ్‌జడ్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, వెదురు పామ్, స్నేక్ గార్డ్, పీస్లిల్లీస్ తదితర మొక్కలు ఇంటిలోని కాలుష్య కట్టడికి బాగా ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని సులభంగా పెంచుకోవచ్చు. అలోవేరా ప్రస్తుతం చాలా ఇండ్లలో కనిపించే మొక్క. కేవలం ఆయుర్వేదం పరంగానే కాదు ఇంట్లోని కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఉపకరిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్న కుండీలో తక్కువ నీటితో కాస్త వెలుతురులోనూ పెరుగుతుంది. గాలిలోని కర్బన ఉద్గారాలను వడపోసి స్వచ్ఛమైన గాలిని ఇంట్లో ప్రసరింపజేసేలా ఈ మొక్క ఉపయోగపడుతుంది. అందుకే దీనికి వడపోత మొక్కగా పేరుంది.
వెదురు పామ్ మొక్క : మిలిగిన అన్ని మొక్కలతో పోల్చితే వెదురు పామ్ మొక్క తక్కువ నీటితోనే సులువుగా, గుబురుగా పెరుగుతుంది. వెలుతురు అవసరం లేదు. ఫార్మాల్దిహైడ్, డ్రైక్లోరోఇథిలిన్, జైలిన్, టోలిన్ వంటి విషవాయువులను గ్రహిస్తుంది. ఇంటికి సరికొత్త అందాన్నిస్తుంది. ఇంటి తలుపులు, కిటికీలు, వరండాల్లో పెంచుకోవచ్చు.
స్పైడర్ ప్లాంట్ : దీనికి మరో పేరు గాలి మొక్క. తక్కువ నీటితోనూ సులువుగా పెరుగుతుంది. నేరుగా సూర్యరశ్మీ పడాల్సిన అవసరం లేదు. ఆకులను కోసి వేరొక కుండీలో పెట్టినా బతుకుతుంది. కార్బన్ మోనాక్సైడ్, బెంజిన్ వాయువులను తగ్గిస్తుంది. గోడలకు వేసే రంగులు, డిటర్జెంట్స్ నుంచి వచ్చే విపరీతమైన వాసనను గ్రహిస్తుంది. గదిలో ఓ మూల, కార్యాలయాల ఆవరణల్లోనూ పెంచుకోవచ్చు.
డ్రాగన్ మొక్క : ఇది 12 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. వెలుతురు అవసరం లేకుండానే ఎదుగుతుంది. కార్యాలయాలు, ఇండ్లలో పెంచుకునేందుకు సులువుగా ఉంటుంది. ఎండిపోకుండా నీరు ఎప్పటికప్పుడు పోస్తూ ఉండాలి. గది ఉష్ణోగ్రతలతో 12 అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది. పెయింట్స్, డిటర్జెంట్స్, వార్మిష్ల నుంచి వచ్చే ఘాటు వాసనలను గ్రహిస్తుంది. వంట గదిలో నూనెలు కాలినప్పుడు వేపుళ్లు వేస్తున్నప్పుడు వచ్చే ఘాటు పొగలను తీసుకుంటుంది. వంటగదికి దగ్గరగా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
స్నేక్ గార్డ్ :
మరో మొక్క స్నేక్ గార్డ్ ఆకులు పాము ఆకారంలో ఉంటాయి. ఇవి మూడు రకాలు. ఇవి కూడా ఫార్మాల్దిహైడ్, ట్రైక్లోరో ఇథిలిన్, లోబిన్, బెంజిన్ను గ్రహించి స్వచ్ఛమైన గాలినిస్తుంది. పీస్లిల్లీస్ మొక్క కూడా రాత్రివేళల్లో కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సీజన్‌ను అందిస్తుంది. నేరుగా ఆక్సీజన్ ఇచ్చే మొక్క ఇది.
జడ్‌జడ్ ప్లాంట్ : కూడా ఇంటిలోని కాలుష్యాన్ని కట్టడి చేస్తుంది. ఇది ముదురు ఆకుపచ్చ రంగు ఆకులతో ఆకట్టుకునేలా ఉంటుంది. తక్కువ వెలుతురు, ఎత్తులో ఎక్కువ కాలం పెరుగుతుంది. ఇది గాలి కాలుష్యాన్ని దీనిని గదిలో వెలుతురు రాని ప్రదేశాల్లోనూ పెంచుకోవచ్చు.
ఆహ్లాదం.. ఆరోగ్యం
ఆక్సిజన్ అందించే మొక్కలకు చాలా డిమాండ్ ఉంది. చాలా మంది వాటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రమాదకర అమ్మోనియా, బెంజిన్, ట్రైక్లోరో ఇథిలిన్ వంటి వాయువులను గ్రహించే మొక్కలు ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. వాటిని ఇంటిలో ఏ మూలనైనా ఉంచొ చ్చు. ఇండ్లలో మనకు తెలియకుండానే విష వాయువులు ఉంటాయి. ప్లాస్టిక్ నుంచి కొన్ని వాయువులు వెలువడుతుంటాయి. వీటిని పెంచుకుంటే ఆహ్లాదకర వాతావరణంతో పాటు స్వచ్ఛమైన గాలిని కూడా ఇస్తాయి.
-ఫాతిమా, నర్సరీ నిపుణురాలు
నగర వాసులు కచ్చితంగా పెంచుకోవాలి
మనకు తెలియకుండానే మనం విష వాయువులను పీలుస్తున్నాం. అవి మనల్ని దవాఖానల పాలుజేస్తాయి. అందుకే ఇంట్లో ఔషధ మొక్కలు పెంచుకుంటే విష వాయువులను శుభ్రం చేస్తాయి. స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఈ మొక్కల పెంపకం నగరాల్లో ఉండే వారికి మరింత అవసరం.
-యూసుఫ్, నర్సరీ నిపుణుడు
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- indoor plants
- oxygen
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

