Open schools : ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ గడువు పొడగింపు

షాబాద్ : జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో 2021-22 సంవత్సరానికి గాను తెలంగాణ సార్వత్రిక విద్య(TOSS) ఎస్.ఎస్.సి, ఇంటర్మీడియట్లో అడ్మిషన్ పొందుటకు అపరాధ రుసుముతో ఈ 24వ తేది నుంచి అక్టొబర్ 21వరకు గడువు పొడగించిన్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుసిందర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.ఎస్.సి, ఇంటర్మీడియట్లో ప్రవేశ కోసం అభ్యాసకులు దరఖాస్తు ఫారంను ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌ను తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం వెబ్ సైట్ www.telanganaopenscool.org ద్వారా పూర్తి చేసి డెబిట్ లేదా క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా టి.ఎస్ ఆన్లైన్, మీసేవ ద్వారా ఫీజు చెల్లించవచ్చన్నారు.
ఫీజు ఎస్.ఎస్.సీలో అడ్మిషన్‌కు ఓసీ (పురుషులకు) రూ. 1100, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు బాలికలకు రూ. 700, ఇంటర్మీడియట్లో అడ్మిషన్‌కు ఓసీ (పురుషులకు) రూ. 1300, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికలకు రూ. 1100 చెల్లించాలన్నారు. అపరాధ రుసుము ఎస్.ఎస్.సికి రూ. 100, ఇంటర్మీడియట్కి రూ. 200 ఉంటుందన్నారు. మీ దగ్గర్లోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌ను సంప్రదించాలన్నారు. ఇతర వివరాల కోసం ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ కె.వి సత్యనారాయణ 8008403515 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

