ఇంటికి మహాలక్ష్మి ఆడపిల్ల
ఆడపిల్ల.. ఇంటికి మహాలక్ష్మి అని జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి అన్నారు. ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు ఆనందపడాలన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బుధవారం బషీరాబాద్ బాలికల పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
- వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి
- ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం
బషీరాబాద్, జనవరి 24 : ఆడపిల్ల.. ఇంటికి మహాలక్ష్మి అని జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి అన్నారు. ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు ఆనందపడాలన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బుధవారం బషీరాబాద్ బాలికల పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కొందరు ఆడపిల్ల పుడితే భారంగా భావిస్తారని, మగ పిల్లల కోసం ఆరాటపడుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కడుపులో ఉండగానే ఆడపిలని తెలిస్తే భ్రూణ హత్యలు జరిగేవని, ఇప్పుడు కొంతమేర మార్పు వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆడపిల్ల పుడితే కేసీఆర్ కిట్ ద్వారా రూ.13 వేలు ఆర్థిక సాయం చేయడంతో పాటు కల్యాణ లక్ష్మి కింద పెండ్లికి లక్ష రూపాయల సాయం చేసిందని గుర్తు చేశారు. పదో తరగతిలో సత్తా చాటాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హీర్యానాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్‌ప్రసాద్, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.
బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
బొంరాస్‌పేట, జనవరి 24 : బాలికలు చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎంఈవో రాంరెడ్డి అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బుధవారం దుద్యాల మండలం చెట్టుపల్లితండా కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాలికల చదువు సమాజానికి వెలుగని, సమాజంలో స్త్రీ పురుష అసమానతలు తగ్గాలని బాల్య వివాహాలు అరికట్టడంలో అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా బాలికలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉపన్యాసం, వ్యాస రచన పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు బాకారం చంద్రశేఖర్, టీవీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌గౌడ్, గోపాల్, ఎస్వో రాధిక, పాల్గొన్నారు. బొంరాస్‌పేట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ జీవనజ్యోతి, దళితవాడ పాఠశాల హెచ్ఎం శ్వేత, చిన్నారులు ర్యాలీ నిర్వహించారు.
బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి
కొడంగల్, జనవరి 24 : బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఉపవైద్యాధికారి రవీంద్రయాదవ్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల ఆవరణలో కొడంగల్‌లోని రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికలు అన్ని రంగాల్లో రాణించేందుకు వారి తల్లిదండ్రులు పూర్తి బాధ్యతతో పాటు ప్రోత్సహించాలన్నారు. అనంతరం ఎంఈవో రాంరెడ్డి మాట్లాడుతూ బాలికల చదువు సమాజానికి వెలుగులు నింపుతుందన్నారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలన్నారు.
సమాజంలో స్త్రీ, పురుషుల అసమానతలు తొలగినప్పుడే సమర్థవంతమైన సమాజం నెలకొంటుందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌గౌడ్ తెలిపారు. అనంతరం బాలికా దినోత్సవాన్ని, స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపన్యాస, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఆనంద్‌తో పాటు వెంకట్, గోపాల్ పాల్గొన్నారు
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

