చదువుతోనే ఉజ్వల భవిత
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన అందుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి అన్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ 5వ వార్డు సోలిపూర్ గ్రామంలో దివ్యశక్తి రౌండ్‌టేబుల్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ. 40లక్షలతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని శనివారం ప్రారంభించారు.
- ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి
షాద్‌నగర్‌టౌన్, జూన్ 22: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన అందుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి అన్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ 5వ వార్డు సోలిపూర్ గ్రామంలో దివ్యశక్తి రౌండ్‌టేబుల్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ. 40లక్షలతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఉపాధ్యాయులతో మెరుగైన విద్యాబోధన ఉంటుందన్నారు.
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణిస్తున్నారన్నారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కౌన్సిలర్ కృష్ణవేణి, కమిషనర్ వెంకన్న, వివిధ పార్టీల నాయకులు బాబర్‌ఖాన్, రమేశ్‌యాదవ్, ఆంజనేయులు, వెంకటేశ్, ఆనంద్, నర్సింహులు, ప్రవీణ్, రాజ్‌కుమార్, శ్రీకాంత్, వెంకటేశ్, కుమార్, జంగయ్య, అనిల్, రాజేశ్, వెంకటయ్య, రాఘవేందర్, రాజశేఖర్, శివరాములు, మహేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

