రోడ్డెక్కిన బాల్యం
స్కూల్ బ్యాగ్ మోయాల్సిన వయసులో, సైకిల్ తొక్కాల్సిన ఈడులో మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు ట్రాక్టర్ స్టీరింగ్ పట్టుకుని రోడ్కెక్కాడు. ఈ దృశ్యాన్ని బషీరాబాద్-ఇందర్చేడ్ రోడ్డు మార్గంలో గురువారం నమస్తే తెలంగాణ క్లిక్కుమనిపించింది.
- ట్రాక్టర్ స్టీరింగ్ పట్టిన మైనర్ బాలుడు
బషీరాబాద్, మే 21 : స్కూల్ బ్యాగ్ మోయాల్సిన వయసులో, సైకిల్ తొక్కాల్సిన ఈడులో మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు ట్రాక్టర్ స్టీరింగ్ పట్టుకుని రోడ్కెక్కాడు. ఈ దృశ్యాన్ని బషీరాబాద్-ఇందర్చేడ్ రోడ్డు మార్గంలో గురువారం నమస్తే తెలంగాణ క్లిక్కుమనిపించింది. ట్రాలీ నిండా మొరంతో రోడ్డుపై రయ్యిన దూసుకెళ్తున్న దృశ్యం స్థానికులను ఆశ్చర్యపర్చింది. సరిగ్గా బ్రేక్ వేయడం తెలియని వయసు, ఎదురుగా వచ్చే వాహనాలను అంచనా వేయలేని పసితనం.. ఒక్క సెకన్ ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదని చర్చించుకున్నారు. తల్లిదండ్రులు తమ అబ్బాయి బాగా నడుపుతాడు అనే మురిపెం తప్ప బిడ్డ ప్రాణం మీదకు తెస్తుందని ఆలోచించడంలేదు. మండలంలో మైనర్లు వాహనాలు నడపడం షరా మామూలైందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం, తల్లిదండ్రులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
Earthquake | ల్యాండింగ్‌కు క్షణాల ముందు భూకంపం.. గాల్లోకి తిరిగి వెళ్లిన విమానం!
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

