ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

- ఫీవర్ సర్వే ద్వారా ప్రజలకు మరింత భరోసాను ఇవ్వాలి
- దుండిగల్ పీహెచ్‌సీని సందర్శించిన కలెక్టర్
దుండిగల్, మే 22: కరోనా సమయంలో వైద్యులు, అధికారులు ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి సూచించారు. శనివారం దుండిగల్ పట్టణ ఆరోగ్యకేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి కొవిడ్ నిర్ధారణ పరీక్షలకు వచ్చే వారికి అందించే సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దుండిగల్ మున్సిపాలిటీని సందర్శించి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ హెల్ప్‌లైన్ డెస్క్‌కు వస్తున్న ఫిర్యాదులు, కొవిడ్ రోగులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు వంటి వాటిపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వైద్యులు, అధికారులు బాధ్యతతో పనిచేయాలన్నారు. అనంతరం దొమ్మరపోచంపల్లిలో కొనసాగుతున్న ఫీవర్ సర్వేను పరిశీలించి సిబ్బంది ద్వారా ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, మందుల పంపిణీతో పాటు వారికి నిరంతరం అందుబాటులో ఉంటూ మరింత భరోసా ఇవ్వాలని సూచించారు. దీనికి తోడు లాక్డౌన్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సాగే పలు వ్యాపారాలు, దుకాణ సముదాయాల వద్ద జనాలు గుమికూడకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, డీఎంహెచ్‌వో మల్లికార్జున్, తహసీల్దార్ భూపాల్, దుండిగల్ కమిషనర్ భోగీశ్వర్లు, వైద్యాధికారి నిర్మల, సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

