చివరి గింజవరకూ కొంటాం

- ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- ఫీవర్ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి
- ఏదులాబాద్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం, జ్వర సర్వేను పరిశీలించిన మేడ్చల్ కలెక్టర్ శ్వేతామహంతి
ఘట్కేసర్ రూరల్, మే 13: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. గురువారం ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డితో కలిసి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు(కాంటాలు), ధాన్యం గన్నీ సంచులు, రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. పంట దిగుబడి, ధాన్యం కొనుగోలు, టోకెన్ల పంపిణీ తదితర వాటిని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమచేయడం జరుగుతుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా గన్నీ సంచుల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, జిల్లా కో ఆపరేటివ్ అధికారి పాల్గొన్నారు.
జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి..
- ఫీవర్ సర్వేను ఆరోగ్య సిబ్బంది పకడ్బందీగా నిర్వహించి అవసరమైన వారికి మెడికల్ కిట్లు అందించాలని కలెక్టర్ శ్వేతామహంతి తెలిపారు.
- ఏదులాబాద్ గ్రామంలో ఇంటింటికీ నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేను దగ్గరుండి పరిశీలించారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

