Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Suchitra Flyover | సంవత్సరాలు గడుస్తున్నా నిర్మాణ పనులు జాప్యం కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని సుచిత్ర ఫ్లైఓవర్ నిర్మాణ పనుల జాప్యానికి నిరసనగా, ఫ్లైఓవర్ స్తంభాలకు మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సుచిత్ర ఫ్లైఓవర్‌కు పిండప్రదానం చేశారు.
Suchitra Flyover | నేషనల్ హైవే- 44 మార్గంలో ట్రాఫిక్ నియంత్రణకు హెచ్ఎండీఏ, నేషనల్ హైవే అథారిటీ ఆధ్యర్వంలో రెండు వేర్వురు ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతున్నాయని తెలిసిందే. ప్యారడైజ్- బోయిన్పల్లి మీదుగా డెయిరీ ఫామ్ వరకు ఫ్లైఓవర్ 5. 32 కిలోమీటర్లకు.. రెండో ప్రాజెక్ట్ సుచిత్ర నుంచి కొంపల్లి మీదుగా మేడ్చల్ 6 లైన్ల ఫ్లైఓవర్‌తో అండర్ పాస్‌ల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి.
అయితే సంవత్సరాలు గడుస్తున్నా నిర్మాణ పనులు జాప్యం కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని సుచిత్ర ఫ్లైఓవర్ నిర్మాణ పనుల జాప్యానికి నిరసనగా, ఫ్లైఓవర్ స్తంభాలకు మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సుచిత్ర ఫ్లైఓవర్‌కు పిండప్రదానం చేశారు. నాలుగేండ్లకు సగం పనులేనా..? ఆగిపోయిన ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి. RIP RIP సుచిత్ర ఫ్లైఓవర్ అంటూ నినాదాలు చేశారు.
2022లో ప్రారంభమైన నిర్మాణ పనులు మొదట్లో 2024 డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.. అయితే ఆ టైంకు పూర్తికాకపోవడంతో తిరిగి తుది గడువును జూన్ 2026 వరకు పొడిగించారు. సుచిత్ర నుంచి మేడ్చల్ వరకు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ చేతులు ఎత్తేయడంతో పనులు అర్థాంతరంగా నిలిపివేసినట్లు సమాచారం. అయినా రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ హైవే అథారిటీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రజలకు చుక్కలు చూస్తున్నారు. అయితే కాంట్రాక్టర్లకు నిధుల విడుదల ఆలస్యం కావడం వల్లే పనులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
సుచిత్ర ఫ్లైఓవర్‌కు పిండప్రదానం
హైదరాబాద్‌లోని సుచిత్ర ఫ్లైఓవర్ నిర్మాణ పనుల జాప్యానికి నిరసనగా, ఫ్లైఓవర్ స్తంభాలకు పిండప్రదానం చేసిన మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు https://t.co/voV8vfscMZ
— Telugu Scribe (@TeluguScribe) October 11, 2026
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

