‘మహిళలు ఆర్థికంగా రాణించాలి’

జీడిమెట్ల, మార్చి 30 : బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ఇలా ఎవరి సహాయం లేకుండానే ఆర్థిక స్వావలంబన వైపు వేసేందుకు మహిళలు ముందుకు రావడం అభినందనీయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధి లెనిన్‌నగర్‌లో 60 మంది సభ్యులతో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గమ్మ, పోచమ్మ మహిళ పరపతి పొదుపు సంఘాన్ని మంగళవారం ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్‌తో కలిసి స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పొదుపు చేసుకునే డబ్బుతో మహిళలు కుటుంబ అవసరాలను తీర్చడమే కాకుండా ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడవచ్చన్నారు.
బ్యాంకులు, ప్రభుత్వం ఇచ్చే రుణాలను తీసుకుని వాటిని క్రమంతప్పకుండా చెల్లించడం ద్వారా మరిన్ని రుణాలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో చింతల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, మహిళలు శ్రీ దుర్గమ్మ, పోచమ్మ మహిళ పరపతి పొదుపు సంఘం అధ్యక్షురాలు డి.దుర్గ, ఉపాధ్యక్షురాలు పి.సుజాత, సుకన్య, ప్రధాన కార్యదర్శి ఎస్.పద్మ, సంయుక్త కార్యదర్శులు జి.వినోద, నాగమణి, కోశాధికారి కె.భాగ్యమ్మ, క్యాషియర్లు పి.రత్న, పి.కల్పన, మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్యారెడ్డి, దివ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- mla vivekananda goud
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

