మేడిపల్లి పీఎస్ పరిధిలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ.. బంగారు ఆభరణాలు అపహరణ
తాళం వేసిన ఇంట్లో బంగారు ఆభరణాలు అపహరణ కు గురైన ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
మేడిపల్లి, అక్టోబర్ 14 : తాళం వేసిన ఇంట్లో బంగారు ఆభరణాలు అపహరణ కు గురైన ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ భీంరెడ్డి నగర్ కాలనీ లో నివాసముంటున్న నానం చర్ల బాలలింగయ్య స్వగ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామంలో భూపంచాయితీ కోసం ఈనెల 5న భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లారు.
ఈ క్రమంలో 13న ఉదయం ఇంటి ప్రధాన ద్వారం తోపాటు వంటగది తలుపు తాళాలు పగుల గొట్టి చోరీకి పాల్పడినట్లు గుర్తించిన స్థానికులు బాల లింగయ్యకు సమాచారం అందించారు. బాధితుడు ఇంటికి వచ్చి చూడగా బెడ్ రూంలో బీరువా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న 15 తులాల బంగారు ఆభరాణాలు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్ల్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

