Ganja Batch | గంజాయ్ బ్యాచ్ వర్సెస్ పోలీసులు.. ఇన్ఫార్మర్ నెపంతో దాడి జరిగిందా..?
ఈ నెల 16న రాత్రి సమయంలో కుత్బుల్లాపూర్ అయోధ్యనగర్‌లో హాష్ అయిల్ గంజాయిని విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కోటమ్మ నేతృత్వంలో దాడులు చేపట్టారు.
Ganja Batch | కుత్బుల్లాపూర్, ఆగస్టు 17 : కుత్బుల్లాపూర్‌లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. గంజాయి బ్యాచ్‌ను పట్టుకునేందుకు వచ్చిన హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల సమక్షంలో ఓ యువకుడిపై సర్జికల్ బ్లేడ్‌తో జరిగిన దాడి సంచలనంగా మారింది. కాగా ఇదే సంఘటనపై గాయాలపాలైన బాధితుడి కుటుంబ సభ్యులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జీడిమెట్ల పోలీస్టేషన్లో ఫిర్యాదులు చేసిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.
ఇరువురు స్థానిక పోలీస్టేషన్లో చేసిన ఫిర్యాదుల ఆధారంగా వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 16న రాత్రి సమయంలో కుత్బుల్లాపూర్ అయోధ్యనగర్‌లో హాష్ అయిల్ గంజాయిని విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కోటమ్మ నేతృత్వంలో దాడులు చేపట్టారు. ఈ దాడిలో హేమంత్, నితిష్, రవితేజా, చరణ్‌ను విచారిస్తున్న క్రమంలో కుత్బుల్లాపూర్ వెంకటేశ్వరనగర్ కాలనీకి చెందిన బి చంటియాదవ్(28) తన పనులు ముగించుకొని అటువైపు నుండి వస్తుండగా పోలీసులకు గంజాయి విక్రయదారులకు మధ్య జరుగుతున్న పెనుగులాటలో జోక్యం చేసుకోవడంతో అకస్మాత్తుగా చంటియాదవ్ తలభాగంలో చెవిపై సర్జికల్ బ్లేడ్‌తో దాడి జరిగింది. తీవ్ర రక్తస్రావం కావడంతో చంటిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా 15 కుట్లు పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు…?
ఇదే సంఘటనపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో బాధిత కుటుంబంతోపాటు హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కోటమ్మలు ఇచ్చిన ఫిర్యాదులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎక్సైజ్ అధికారులు గంజాయి బ్యాచ్ వత్తాసు పలుకుతూ తమ సోదరుడి చంటిపై దాడి చేశారని గాయాలపాలైన బాధితుడి అన్న ప్రవీన్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా విధి నిర్వహణలో తమ విధులకు పూర్తిగా ఆటంకం కలిగించారని హేమంత్, నితిష్, రవితేజా, చరణ్‌తోపాటు ఇతరులపై ఇన్స్పెక్టర్ సిహెచ్ కోటమ్మ ఫిర్యాదు చేసింది.
ఇన్ఫార్మర్ అనే నెపంతో దాడి జరిగిందా..!
కాగా బాధితుడు పోలీసులకు ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడని, తమ గుట్టును పోలీసులకు చేరవేయడంతోనే గంజాయి బ్యాచ్ ఈ దాడికి పాల్పడ్డారా..? అనే ప్రశ్నలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి. అయితే సర్జికల్ బ్లేడ్లు గంజాయి బ్యాచ్ వద్దనే ఉంటాయే తప్పా పోలీసుల వద్ద ఎందుకు ఉంటాయని, పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగినప్పుడు గంజాయి బ్యాచ్‌ను ఎందుకు పట్టుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటనపై ఇటు పోలీసుల అత్యుత్సాహంతోపాటు అటు గంజాయి బ్యాచ్ ఆగడాలే ఈ సంఘటనకు దారి తీశాయంటూ పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా ఇదిలా ఉండగా జీడిమెట్ల పోలీసులు తమకేమి తెలియదన్న చందనంగా ఇరువురు ఎఫ్ఎఆర్ కాఫీలు మీడియా గ్రూప్‌లో పోస్ట్ చేయడం గమనార్హం. ఇతర సంఘటనలు జరిగిన సమయంలో ఎఫ్ఎఆర్ కాఫీలను బహిర్గతం చేయకుండా ఉండే పోలీసులు ఈ సంఘటనతో నేరుగా ఇరువురికి సంబంధించిన ఎఫ్ఐఆర్లు బహిర్గతం చేయడం గమనార్హం.

Read Also :
Vijay Devarakonda | న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో విజయ్ దేవరకొండ.. వీడియో
Dhoni Fan | ధోనీకి వీరాభిమాని..హెలిక్యాప్టర్ షాట్లతో అలరిస్తున్న బుడ్డోడు.. వీడియో..!
Mareesan OTT | ఓటీటీలోకి ఫహాద్ ఫాసిల్, వడివేలు కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

