ఫీజులు బాదారు.. రద్దు చేశారు..

- ప్రైవేట్ దవాఖానలపై ప్రత్యేక నజర్
- కొవిడ్ వైద్యం పేరిట అధిక ఫీజులు వసూలు
- మేడ్చల్ జిల్లాలో మూడు దవాఖానల్లో కొవిడ్ వైద్య సేవలు రద్దు
- మరో 10 దవాఖానలకు నోటీసులు జారీ
మేడ్చల్, మే 30 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ చికిత్స పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ దవాఖానలపై వైద్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కొవిడ్ చికిత్సకు బాధితుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు వైద్యశాఖకు ఫిర్యాదు అందిన వెంటనే తక్షణ చర్యలు చేపడుతున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా బాధితులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా 3 ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ వైద్య సేవలను రద్దు చేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావు వెల్లడించారు. మరో 10 దవాఖానలకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నోటీసులు జారీచేసిన దవాఖానలపై వైద్యశాఖ విచారణ కొనసాగుతుందన్నారు. బాధితులకు కూడా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రద్దు చేసిన వాటిలో ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్న వారికే అనుమతి ఉంటుందని.. కొత్తగా కొవిడ్ బాధితులను చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మ్యాక్స్ హెల్త్, సాయి సిద్ధార్థ, నీలిమ దవాఖానల్లో కొవిడ్ చికిత్సలను రద్దు చేశారు.
అధిక ఫీజులపై సమాచారం ఇవ్వండి
- కొవిడ్ చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ దవాఖానలపై సమాచారం ఇవ్వాలని మేడ్చల్ జిల్లా వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
- జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ 9492409781కు సమాచారం అందించిన వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు.
- అలాగే కొవిడ్ వ్యాధిపై ఎలాంటి అనుమానాలు ఉన్నా.. హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సంప్రదించవచ్చునని సూచించారు.
- కొవిడ్ బాధితులు, గర్భిణులకు వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాలను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతామహంతి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- Covid Hospitals
RELATED ARTICLES
తాజా వార్తలు
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

