వ్యాక్సిన్ కొరత లేదు

మేడ్చల్, మే11(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా కరోనా రెండో విడత వ్యాక్సిన్‌కు ఏ మాత్రం కొరతలేదని, ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతామహంతి సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ జూమ్ సమావేశం నిర్వహించారు. కరోనా మొదటి విడత వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇచ్చిన గడువులోగా రెండో విడత వ్యాక్సిన్ అందజేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్లు ప్రతిరోజు దవాఖానలను సందర్శించి సమస్యలను తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జడ్పీ సీఈవో దేవసహయం, వైద్యాధికారి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
మేడ్చల్, మే 11: వైద్యాధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించి కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. మేడ్చల్‌లోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్‌తో కలిసి సందర్శించి కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును, ఐసొలేషన్ వార్డును, రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో దేవసహయం, డీఎంహెచ్‌వో మల్లికార్జున్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ దీపికానర్సింహరెడ్డి, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

