Kodangal : ఇన్స్ఫైర్ పోటీల్లో అశోక్‌కు కాంస్యం..

కొడంగల్ : జాతీయస్థాయిలో నిర్వహించిన ఇన్స్ఫైర్ మనక్ పోటీల్లో వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని గోకాఫసల్వాద్ విద్యార్థి అశోక్ ప్రదర్శించిన సీలింగ్ ఫ్యాన్ లిఫ్టింగ్ టూల్ ప్రాజక్టు 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకం సాధించాడు. శుక్రవారం బెంగుళూర్లో జరిగిన సమావేశంలో విద్యార్థి పథకాన్ని అందుకున్నాడు. దేశ వ్యాప్తంగా 43 వేల ప్రాజక్టులు నమోదు చేసుకోగా జిల్లా స్థాయిలో పోటీలో పాల్గొనే అవకాశం లభించింది. ఆ తరువాత దశల వారిగా జరిగిన పోటిల్లో వెయ్యికి పైగా ప్రాజెక్టులు టాప్-60లో నిలవగా ప్రత్యేక పోటీ నిర్వహించారు. పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఆవుటి శాంత్‌కుమార్ సహాయంతో విద్యార్థి సీలింగ్ ఫ్యాన్ లిఫ్టింగ్ టూల్ ప్రాజెక్టును తయారు చేసి పోటీల్లో ప్రదర్శించారు.
బెంగళూరు లోని ఎన్ఐఏఎస్, ఐఐఎస్సీ క్యాంపస్‌లో నిర్వహించిన అవార్డు ప్రధానం కార్యక్రమంలో ఎన్ఐఎఫ్ డైరెక్టర్ విపిన్‌కుమార్, ఇస్రో చీఫ్ పీఎస్. గోయల్ చేతుల మీదుగా విద్యార్థితో పాటు ఉపాధ్యాయుడు అవార్డును అందుకున్నారు. జాతీయ స్థాయిలో 3వ స్థానం సాధించి కాంస్య పథకాన్ని సాధించిన విద్యార్థితో పాటు ఉపాధ్యాయుడిని జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి అభినంధించడంతో పాటు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది ప్రత్యేకంగా అభినంధనలు తెలిపారు.

Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

